Junior ntr to attend alludu srinu movie audio function on 29 august

junior ntr to attend alludu srinu movie audio function on 29 august, alludu seenu movie, alludu seenu movie news, alludu seenu first look photos, junior ntr to attend alludu seenu audio function, alludu seenu audio function, alludu seenu audio songs release

junior ntr to attend alludu srinu movie audio function on 29 august

‘‘అల్లుడు’’ కోసం ఎన్టీయార్ వస్తాడా?

Posted: 06/25/2014 01:59 PM IST
Junior ntr to attend alludu srinu movie audio function on 29 august

(Image source from: junior ntr to attend alludu srinu movie audio function on 29 august)

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరయిన బెల్లంకొండ శ్రీనివాస్... తన కుమారుడ్ని హీరోగా తెలుగు తెరకు ‘‘అల్లుడు శీను’’ సినిమా ద్వారా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే! సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుమారు 11కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు 30 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో... టాలీవుడ్ డ్రీం గర్ల్ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెకు కూడా బెల్లంకొండ సురేష్ ఒక బంగ్లా, కారుతోపాటు చాలావరకు డబ్బులు సమర్పించుకున్నట్లు టాక్!

తనయుడికోసం ఎంతటి రిస్క్ నైనా తీసుకోవడానికి సై అంటున్న బెల్లంకొండ... ఈ సినిమా ఆడియో వేడుకను 29వ తేదీన శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. స్పెషల్ అట్రాక్షన్ కోసం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీయార్ ను కూడా ఆహ్వానించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. అంతేకాదండోయ్... తెలుగు ఇండస్ట్రీలో వున్న చాలా మంది ప్రముఖులను, తారలను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బెల్లంకొండ ఆహ్వానం పంపినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా తనయుడి టాలీవుడ్ ఎంట్రీకోసం ఇప్పటికే చాలా డబ్బులు సమర్పించుకున్నారని టాలీవుడ్ కొడై కూస్తోంది. ఈ సినిమాలో కేవలం గ్రాఫిక్స్ కోసమే 5 కోట్ల వరకు వెచ్చించినట్లు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆడియో ఫంక్షన్ కోసం ఎన్టీయార్ కు ఎంతవరకు సమర్పించుకున్నారోనని అందరు గుసగుసలాడుకుంటున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో వున్న ఈ మూవీని... జూలై 24వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles