Kareena kapoor controversial comments on her friends

kareena kapoor controversial comments on her friends, kareena kapoor, kareena kapoor latest news, kareena kapoor comments on her friends, kareena kapoor latest photo shoot, kareena kapoora hot photos, kareena kapoor hot photo shoot, kareena kapoor talks about her life

kareena kapoor controversial comments on her friends

అతనికోసం అలా చేశా.. ఇక నావల్ల కాదు!

Posted: 06/25/2014 04:35 PM IST
Kareena kapoor controversial comments on her friends

(Image source from: kareena kapoor controversial comments on her friends)

బాలీవుడ్ అందాల తారల టాప్ లిస్ట్ లో ఒకరైన సెక్సీ తార కరీనా కపూర్... తాజాగా తాను నటించిన పాత్రలను గుర్తు చేసుకుని, కొన్ని సంచలనాత్మకమైన కామెంట్లు గుప్పించారు. గత కొద్దికాలంగా సరైన హిట్ లభించకపోవడంతో తహతహలాడుతున్న ఈ భామ... అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు కనిపిస్తోంది. ‘‘గోరీ తేరే ప్యార్ మే’’ సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకున్న ఈ భామకు... ఆ సినిమా బాక్సీఫీసు దగ్గర బోల్తా పడటంతో తీవ్ర నిరాశకు గురయ్యింది. ఈమె నటించిన సినిమాలన్నింటిలో దాదాపు చాలావరకు పరాజయం పాలయ్యాయి. గతంలో తాను నటించిన పాత్రల గురించి, అందులో వున్న వైఫల్యాలు - ప్లస్ పాయింట్ల గురించి గుర్తు చేసుకుంది.

అలాగే తన ఫ్రెండ్స్ ని తిట్టకనే తిడుతూ... వారిపై ఘాటు విమర్శలు చేసేసింది. ‘‘గతంలో తాను నటించిన సినిమాలు కేవలం స్నేహం కోసమేనని... కానీ ఇప్పటి నుంచి కేవలం మంచి పాత్ర వున్న కథలకే ప్రాధాన్యతనిస్తానని’’ అంటూ... దొడ్డిదారిన తన స్నేహితులను తిట్టిపారేసింది. అంటే... తన స్నేహితుల వల్లే తన కెరీర్ నాశనం అయిందని చెప్పకనే చెప్పేసిందన్నమాట!

అలాగే... ‘‘ఫ్రెండ్స్ తో సినిమాలు చేసినందుకు అంతగా విచారించడం లేదు. సదరు పాత్రను ఎంచుకోవడంలో నేను తప్పుటడుగులు వేశాను. అందులో వారి తప్పేమీ లేదు’’ అని ఫైనల్ టచ్ తో సర్ది చెప్పుకుంది ఈ బేబో! ఏదేమైనా.. బెబో ఇకనుంచి తన స్నేహితులతో కలిసి సినిమాలు చేయబోదన్న తన మనసులో వున్న మాటను వెళ్లగక్కేసింది.

అలాగే గతంలో తాను చేసిన వేశ్యపాత్రలు కూడా తనను తాను నిరూపించుకోవడానికే చేశానని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరీనా... ‘‘నేను గతంలో పోషించిన వేశ్యపాత్రలు నాకు ఎంతో స్ఫూర్తిగా నిలిచాయి. అటువంటి పాత్రలు నా జీవిత మైలురాయిని మార్చేశాయి. నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి చమేలి, దేవ్ వంటి చిత్రాల్లో వేశ్యగా నటించాను. సినీ పరిశ్రమలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఈ పాత్రలు నన్ను ఎంతగానో సహకరించాయి. అందుకే తలాష్ సినిమాలో కూడా వేశ్య పాత్రలోనే నటించాను. ఇవి నా కెరీర్ లోనే చాలా గొప్ప చిత్రాలు’’ అని తన మనసులో వున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ... ప్రసంగాన్ని ముగించేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles