(Image source from: Anchor anasuya selfie photo with nagarjuna has become hot topic)
‘‘జబర్దస్త్’’ కామెడీ షోలో యాంకర్ గా పనిచేసిన అనసూయ.... రాత్రికి రాత్రే పాపులారిటీని సంపాదించుకుంది. బుల్లితెర ప్రపంచంలో తనదైన ప్రత్యేక పేరును సంపాదించి, ఇతర యాంకర్లను తలదన్నేలా తన ప్రతిభను ప్రదర్శించి ముందుకు దూసుకుపోతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... బుల్లితెర సెలబ్రిటీగా నిలిచిపోయింది.
అనసూయ గతంలో సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ... అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఆమె అక్కడి నుంచి జంప్ చేసి, న్యూస్ రీడర్ గా పరిచయం అయింది. అలాగే ఎంటర్ టైన్ మైంట్ ప్రోగ్రాములకు యాంకరింగ్ చేస్తూ.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని సంపాదించుకుంది. దాంతో ఈమె ముందుకు అవకాశాలు అమాంతంగా వాలిపోయాయి.
అందులో భాగంగానే జబర్దస్త్ కామెడీ షోకి కొన్నాళ్లవరకు యాంకరింగ్ చేసి, ఆ తరువాత తప్పుకుంది. దీంతో మధ్యలో కొంతసమయం వరకు ఖాళీగా సమయాన్ని గడిపింది. ఆ సమయంలో పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వరించినా.. దానిని తిరస్కరించింది. ‘‘ఒకవేళ సినిమాలలో వస్తే హీరోయిన్ గా లేదా ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ లో నటిస్తానని’’ మీడియా సమావేశంలో చెప్పుకుంది.
అయితే ఈ విధంగా వచ్చిన ఈ గ్యాప్ లో సినిమా అవకాశాల కోసం కొన్నాళ్లవరకు బాగానే చక్కర్లు కొట్టిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ చక్కర్లు కొట్టిన నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లిన అనసూయ.. అక్కడ నాగార్జునతో కలిసి ఒక సెల్ఫీ ఫోటోకు పోజిచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో వుండే అనసూయ... తను నాగార్జునతో కలిసి తీసుకున్న ఈ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను కనువిందు చేసిన నెటిజన్లు... సినిమా అవకాశాల కోసమే అనసూయ ఇలా ఈ విధంగా నాగార్జున చనువుగా వుంటోందని అనుకుంటున్నారు.
అయితే అనసూయకు సినిమా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెర బాటవైపే అడుగులు వేయడం ప్రారంభించింది. ఆల్రెడీ ‘‘తడాఖా’’ ప్రోగ్రామ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బుల్లితెర హాట్ యాంకర్... తాజాగా ‘‘జీ టీవీ’’లో రానున్న '1' ప్రోగ్రామ్ కి కూడా యాంకరింగ్ చేయనుంది. ఏదేమైనా... అనసూయ, నాగార్జునతో కలిసి ఈ విధంగా ఫోటో దిగి మళ్లీ వార్తల్లోకెక్కింది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more