Anushka in chiru 150th movie

Anushka In Chiru 150th Movie, Chiranjeevi eyed on Anushka, Anushka acting in chiru 150 film, Chiranjeevi start workouts for body

Anushka In Chiru 150th Movie, Chiranjeevi eyed on Anushka, Anushka acting in chiru 150 film, Chiranjeevi start workouts for body

మెగాస్టార్ కన్ను బొమ్మాళి పై పడింది ???

Posted: 06/13/2014 04:07 PM IST
Anushka in chiru 150th movie

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరియర్లో మిగిలిపోయిన 150 చిత్రాన్ని పూర్తి చేయడానికి పూనుకొని, దానికి సంబందించిన కధలు వినడం, కసరత్తులు ప్రారంభించి తన శారీకృతిని మునుపటి షేప్ లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. చిరు సినిమా చేస్తానని ప్రకటించినప్పుటి నుండి సినిమాకు దర్శకుడు, హీరోయిన్, నిర్మాతలకు సంబంధించి ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కథే ఫైనల్ కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఈమె అంటూ, చిరు ఆమె పై కన్నేశాడంటూ టాలీవుడ్ నుండి మరో వార్త బయలు దేరింది.

చిరంజీవి సినిమాలో మొదట బాలీవుడ్ టాప్ హీరోయిన్ని తీసుకుంటారని అన్నారు. కానీ ఇటీవల సూపర్ స్టార్ రజినీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటిస్తే సూట్ కాకపోవడంతో చిరుకు కూడా బాలీవుడ్ హీరోయిన్లు సూట్ కాదని భావించి ఆ ప్రయత్నాల్ని మానుకొని, సౌత్ హీరోయిన్ అయిన అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ అమ్మడు రెండు భారీ ప్రాజెక్టులే కాకుండా రజనీకాంత్‌తో లింగా, అజిత్‌తో మరో సినిమా చేస్తుంది. వారి వారి ఇండస్ట్రీల్లో సీనియర్ హీరోలు అయిన వీరి సరసన అనుష్క సూట్ అవుతుందంటే చిరు ప్రక్కన ఫర్ పెక్టుగా సూట్ అవుతుందని , చిరు కూడా ఈమె పై ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల తరువాత ఇంట్లో వారు పెళ్లి చేయాలనే ఆలోచనలో చేస్తున్నారు. ఇప్పటికే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ వార్తలొచ్చాయి. మరి చిరు ఆశపడుతున్నట్లు ఆయన ప్రక్కన నటించే ఛాన్స్ వస్తే అనుష్క సై అంటుందా ? కాల్షీట్లు లేవని దాటవేస్తుందా ? వెయిట్ అండ్ సీ.

మెగాస్టార్ కదా.. కన్ను పడితే ఏ హీరోయిన్ అయినా పడాల్సిందే...?????

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles