Bipasha basu to play conjoined twins

ipasha Basu As conjoined In Alone, Bipasha Basu, conjoined twins, Alone, Priyamani

Bipasha Basu will now be seen playing the role of twins who are conjoined at birth.

ప్రియమణి దెబ్బ బిపాసాకు పడబోతుందా ?

Posted: 06/13/2014 02:58 PM IST
Bipasha basu to play conjoined twins

ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్లు హీరోల సరసన నటిస్తే పేరు రావడం లేదని ఫిక్సయ్యారో, లేక తన ఫెర్ఫామెన్స్ ను సింగిల్ గా చూపించడానికి ఇష్టపడుతున్నారో గానీ, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి చాలా మంది ఎగబడతున్నారు. ఇఫ్పటికే టాలీవుడ్ లో ప్రియమణి, ఛార్మి, అనుష్క లాంటి వాళ్ళు నటిస్తే ఇప్పుడా ట్రెండ్ బాలీవుడ్ కు పాకినట్లు కనిపిస్తుంది. ఇటీవలే లేడీ ఓరియెంట్ సినిమాకు సోనాక్షి సిన్హా కటీట్ అయ్యింది.

ఇఫ్పుడు బాలీవుడ్ హాట్ అండ్ సెక్స్ బాంబ్ బిపాసా బసు కూడా లేడీ ఓరియెంట్ చిత్రంలో నటించడానికి సిద్దం అయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రియమణి కి అవకాశాలు తగ్గడంతో కొత్తదనం కోసం ‘చారులత ’ అనే సినిమాలో అవిభక్త కవలలుగా నటించింది. నటనా పరంగా ప్రియమణి పాస్ మార్కులు పడ్డా, సినిమాకు మాత్రం ఫాస్ మార్కులు రాలేదు. దీంతో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఇఫ్పుడు బాలీవుడ్ హాట్ అండ్ సెక్స్ బాంబ్ బిపాస బసు కూడా అవిభక్త కవలల పాత్ర పోషించబోతుంది. ప్రియమణి నటించిన ‘చారులత ’ తెరకెక్కిన థాయ్ చిత్రం ‘ఎలోన్ ’ ఆధారంగానే ఈ సినిమాను కాస్త అటుగా ఇటుగా మార్చి బాలీవుడ్ లో ప్రీమేక్ చేస్తున్నారట.  ఈ నెల 20న షూటింగ్ ఆరంభం కానుంది. తెలుగు జానాలు ఇలాంటి కథను ఆదరించలేదు. ఎప్పుడు హీరోయిన్ అందాలు చూపిస్తుందోనిని ఎదురు చూసే బాలీవుడ్ జనాలు బిపాసా నటిస్తున్న ఈ సినిమాను ఆదరిస్తారో ? లేక ఆమె కెరియర్లో అట్టర్ ప్లాప్ సినిమాగా నిలిపపుతారో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles