Hrithik roshan replace ram charan film

Hrithik Roshan replace Ram Charan film, Ram charan, Hrithik Roshan,Ashutosh Gowariker, Hrithik Roshan Asutosh Govarikaer Movie, Ram Charan out of Asutosh Govariker movie

Asuthosh Gowariker announcing his next film with Hrithik Roshan breaking out speculation is rife about if this was the film that Ram Charan.

రామ్ చరణ్ బాలీవుడ్ కి గుడ్ బై

Posted: 06/11/2014 06:31 PM IST
Hrithik roshan replace ram charan film

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని బిగ్ బి అమితాబ్ నటించిన ‘జంజీర్ ’ చిత్రాన్ని అక్కడ డెబ్యూట్ గా రీమేక్ చేశారు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాకపోవడమే కాకుండా బాక్సాఫీసు కలెక్షన్లలో కూడా వెనకబడి పోయి ప్లాప్ చిత్రాల జాబితాలో చేరింది.

ఈ చిత్రం పరాజయం పాలైనా నిరాశ చెందకుండా  మరో చిత్రం చేయడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్నట్లు వార్తలు రావడమే కాకుండా, ‘లగాన్ ’ చిత్ర దర్శకుడు అశుతోష్ గోవిరికర్ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చరణ్ తో తీస్తానని కూడా ప్రకటించాడు. అప్పటి నుండి దీని పై ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇన్నాళ్ళ తరువాత దీనికి సంబంధించిన వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. రామ్ చరణ్ తో సినిమా తీస్తానని చెప్పిన అశుతోస్ తన తరువాతి సినిమా  హృతిక్ రోషన్ తో చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఇదే సినిమా ముందు చరణ్ తో చేస్తున్నానని ప్రకటించాడు. దీంతో సినీ జనాలు రామ్ చరణ్ స్థానంలోనే హృతిక్ ని తీసుకున్నాడా ? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ టాలీవుడ్ జనాలు మాత్రం వేరేగా చెబుతున్నారు. టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలతో హిట్లు కొడుకుతున్న చరణ్ ఇదే ఫార్ములాను నమ్ముకొని సినిమాలు చేయాలనే ఆలోచనకు వచ్చే బాలీవుడ్ సినిమాను ఇన్ని రోజులు ప్రక్కన పెట్టాడని, చరణ్ అంతగా ఆసక్తిగా లేకపోవడంతోనే అశుతోష్ కొత్తగా ప్రకటన చేశాడే కానీ చరణ్ ని కావాలని తప్పించలేదని అంటున్నారు.

అదీ కాకుండా టాలీవుడ్ లో ఫుల్ స్టార్ డమ్ ఉన్న చరణ్ ఇక్కడి సినిమాల్ని నమ్ముకుంటే చాలని, పరభాషలో చిత్రాలు తీసి ప్లాపులు తెచ్చుకోవడం వేస్ట్ ని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles