Hate story 2 trailer record views on youtube

Hate Story 2, trailer, Jay Bhanushali, Surveen Chawla, 4 million views in youtube, Sushant Singh

official trailer of upcoming film Hate Story 2 has crossed over 4 million views on Youtube with in 4 days.

బూతు ట్రైలర్ కోసం ఎగబడుతున్నారు

Posted: 06/11/2014 08:12 PM IST
Hate story 2 trailer record views on youtube

బాలీవుడ్ దర్శకులు ఇటీవలి కాలంలో బూతునే నమ్ముకుని సినిమాలు చేస్తుంటే జనం విరగబడి చూస్తున్నారు. నిర్మాతలకు కాసుల వర్షం కురిస్తోంది. ఈ తంతు విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్ ’ నుండి నేటి  ‘హేట్ స్టోరీ 2 ’ వరకు కొనసాగుతూ వస్తుంది. మరి ఇన్ని బూతు సినిమాలు చేస్తుంటే సెన్సార్ వాళ్లు ఏ మాత్రం గడ్డిపెట్టడం లేదు.

తాము తీసిన బూతు సినిమాలకు పబ్లిసిటీ పెంచుకోవడానికి ఆ సినిమాలో ఉన్న హాట్ హాట్ సీన్లను ట్రైలర్లుగా విడుడుల చేస్తే నెటిజన్స్ అదే పనిగా కళ్లప్పగించి చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం విడుదలైన ‘హేట్‌ స్టోరీ 2’ అనే ఆ హిందీ చిత్రం ట్రైలర్  బూతు సినిమాను తలపించే విధంగా ఉంది. దీంతో ఇది యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తు తెగ హడావిడి చేస్తోంది.

నాలుగు రోజుల్లోనే నలభై రెండు లక్షలకి పైగా వ్యూస్ తెచ్చుకొని టాక్ ఆప్ ది బాలీవుడ్ గా మారింది.  సుర్వీన్‌ చావ్లా నటించిన హేట్‌ స్టోరీ 2 కు ఉన్న హాట్ హాట్ కంటెంట్ తో ఈ చిత్రం బిజినెస్‌ ఊపందుకుంది. హోల్‌సేల్‌గా ఇండియా మొత్తానికి పంపిణీ హక్కులు తీసేసుకోవడానికి చాలా సినిమా కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతున్నాయని బాలీవుడ్ మీడియా టాక్. దీనిని బట్టి చూస్తుంటే సినీ జనాలు బూతునే ఎక్కువగా ఆదరిస్తారని అర్థం అవుతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles