Balayya shocking no more in faction roles

Balayya no more faction roles, Balakrishna no more faction roles, No Mass and political roles, Balakrishna shock to fans, balakrishna shock to boyapati seenu, Balakrishna To Stop Mass roles

Nandamuri Balakrishna introduced new trend to Tollywood with his Faction films. The actor has decided to quit faction and political films going further.

షాకింగ్ : బాలయ్యను ఇక పై అలా చూడలేం

Posted: 06/06/2014 11:39 AM IST
Balayya shocking no more in faction roles

టాలీవుడ్ ఇండస్ట్రీకి పక్కా మాస్ మాస్ అండ్ ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ తీసుకొచ్చిందంటే బాలయ్యే అని చెప్పవచ్చు. సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలతో తనకంటూ ఓ ట్రెండ్ స్రుష్టించుకున్న బాలయ్య ఆ తరువాత నుండి అదే మూసలో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. దర్శకులు కూడా బాలయ్య కోసం రాసుకునే కథలు ఫ్యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామాలే రాసుకొంటున్నారు. కాదు కొందమంది బాలయ్యనే నమ్ముకున్నారు కూడా.

ఇటీవల ఆయన నటించిన సింహా, లెజెండ్ సినిమాలు కూడా ఫ్యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే బాలయ్య మాత్రం ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. బాలయ్య ఇక నుంచి ఫ్యాక్షన్, పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా సినిమాలు చేయనని ప్రకటించాడు. బాలయ్య తీసుకున్న తాజా నిర్ణయం ఆయన అభిమానులకే కాకుండా దర్శకులను కూడా షాక్ కి గురి చేసింది. ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందూ పురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నతున్నాడు.

బాలయ్య ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ... ఫ్యాక్షన్ లేదా పొలిటికల్ సినిమాలు భావ్యం కాదని, ఇక పై కామెడీ అండ్ రోమాంటిక్ సినిమాలే చేస్తానని, ఫ్యాక్షన్  సినిమాలు చేస్తే  ప్రజలకు వాటిని ప్రోత్సహిస్తూ సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. బాలయ్య నిర్ణయం బాగానే ఉన్నా... ఆయన్ను పవర్ ఫుల్ పాత్రలో చూడాలనుకొనే అభిమానులకే కాకుండా, ఆయన్ను నమ్ముకొని కథలు రాసుకునే మాస్ దర్శకులు, ముఖ్యంగా బోయపాటి శీను లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ? ఈ నిర్ణయంతో ఆయన 100వ సినిమా బోయపాటితో ఉండదని కూడా అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles