Hero suriya to play a ghost role

Hero Surya To Play A Ghost Role, Nayanthara and Amy Jackson to romance Suriya, Nayanthara to romance Suriya, Amy Jackson to romance Suriya

Hero Surya To Play A Ghost Role, Nayanthara and Amy Jackson to romance Suriya, Nayanthara to romance Suriya, Amy Jackson to romance Suriya

దెయ్యం పాత్రలో తమిళ హీరో సూర్య

Posted: 06/06/2014 10:20 AM IST
Hero suriya to play a ghost role

ఎప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడే తమిళ హీరో సూర్య ఇప్పుడు మరో భిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని భయపెట్టడానికి సిద్దం అయ్యాడు. ఈయన తమిళ దర్శకుడు ‘బిర్యానీ ’ ఫేం వెకంట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో దెయ్యం పాత్ర (ఘోస్ట్ ) పాత్రలో నటించబోతున్నట్లు తమిళ వర్గాల సమాచారం. ఇందులో రెండు పాత్రల్లో కనిపించబోతున్న సూర్య ఓ పాత్రలో దెయ్యంలా కనిపించనున్నాడట.

మామూలుగా స్టార్ హీరోలు ఎవ్వరూ అలాంటి పాత్రలు పోషించడానికి ఇష్టపడరు. కానీ సూర్య తన స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ఇలాంటి పాత్రకు కమీట్ అయ్యాడంటే కొత్త దనంతో కూడిన పాత్రలు చేయడానికి ముందుంటాడనడానికి ఇదో నిదర్శనం. ఆ మధ్య దర్శకుడు, నిర్మాత, కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ ‘కాంచన ’ సినిమాలో వైవిధ్యమైన పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.

ఇప్పుడు సూర్య పోషించే పాత్ర కూడా తనకు మంచి పేరు తెస్తుందనే ధీమాతో ఉన్నాడు. నయనతార, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  వెంకట ప్రభు ఈ సినిమాని 3డీ లో తీయనున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఈయన ‘ఆంజాన్ ’ సినిమా బిజీలో ఉన్నాడు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles