Manam satellite rights sold for 7 crores

Manam satellite rights sold for 7 Crores, Manam gets deal for Satellite rights, Manam Movie satellite rights sold for 7.5 crores, Manam gets less satellite rights rate than 1 Nenokkadine rights

Manam satellite rights sold for 7 Crores, Manam gets deal for Satellite rights, Manam Movie satellite rights sold for 7.5 crores, Manam gets less satellite rights rate than 1 Nenokkadine rights

నాగార్జునది పక్కా బిజినెస్ మైండ్

Posted: 06/06/2014 12:45 PM IST
Manam satellite rights sold for 7 crores

అక్కినేని నాగార్జున నట మన్మధ సామ్రాజ్యంలో ఎంత ప్రతిభా వంతుడో బిజినెస్ పరంగా కూడా అంతే ప్రతిభా వంతుడు అనిపించుకున్నాడు. తాను తన ఫ్యామిలీకి చెందిన హీరోలు అంతా కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ‘మనం ’ సినిమాను సొంత బ్యానర్ లో నిర్మించాడు. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి తనదైన స్టైల్లో పబ్లిసిటీ చేశాడు. దానికి తోడు సినిమా మొదటి షో నుండే మంచి టాక్ తెచ్చుకోవమే కాకుండా, రెండు వారాలు గడిచినా కలెక్షన్లు నిలకడగా ఉండటంతో ఈ సినిమా ఇఫ్పటికే దాదాపు 30 కోట్ల మార్క్ కి చేరువయ్యింది.

ఇదే ఊపు కొనసాగితే యాభై కోట్ల మార్క్ ని దాటడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. సినిమా టాక్ అదిరిపోవడంతో ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయి. సొంతంగా టీవీ ఛానళ్ళో వాటాలు కలిగిన అక్కినేని నాగార్జున తన ఛానల్ కి ఇవ్వకుండా ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ ని జెమినీ టీవీ వారికి అమ్మేశాడు. దాదాపు 7 కోట్లకు పైగా చెల్లించి హక్కుల్ని సొంతం చేసుకున్నారు.

నిజానికి నాగార్జున తన సినిమాలను తనకు కూడా వాటాలు ఉన్న మాటీవీకే ఇచ్చేసేవారు. కానీ మనం సినిమాను మాత్రం నాగార్జున మాటీవీకి కాకుండా ఎక్కువ ధరకు అమ్ముకున్నాడు. ఇటీవలి కాలంలో జెమినీ టీవీ పెద్ద సినిమాల శాటిలైట్ హక్కులను భారీ రేటుకి కమిట్ అవుటుండగా ఈ సినిమాను కూడా అదే వరసలో భారీ రేటుకి దక్కించుకోవడం విశేషం. ఇటీవలే బాలయ్య లెజెండ్, మహేష్ ఆగడు సినిమాల హక్కుల్ని సొంతం చేసుకుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles