తన గురించి గాని..తన ఫ్యామిలీ గురించి గాని ఎక్కడైనా కనపడితే తోలు తీస్తానంటూ వార్నింగిచ్చింది. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ అందాల నటి 'ప్రియాంక చోప్రా' కు కోపం వచ్చింది. అతను ఆమె పాత ప్రియుడే కానీ ఇప్పుడు కాదు లేండి? ప్రియాంక కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు 'ఆసీమ్ మర్చంట్' కుర్రాడితో ప్రేమలో కొన్ని పొరపాట్లు చేసింది. అయితే కా మారి ప్రియాంక సినీ స్టార్ గా ఎదిగింది. కానీ పాత ప్రియుడు ఆసీమ్ మాత్రం పెద్దగా ఎదగలేకపోయాడు.
అయితే ఇప్పుడు అతను ఒక సినిమా తీయటానికి సిద్దమయ్యాడు. అతను సినిమా తీస్తున్నాడని తెలిసి, ప్రియాంక అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. గ్లామర్ వెనుకున్న మలుపుల నేపథ్యంలో సినిమా ఉంటుందని వెల్లడించాడు. ఇది పక్కాగా ప్రియాంక జీవిత నేపథ్యంతో కూడుకున్న కథ అని ప్రచారం జరిగింది. దీంతో ప్రియాంక ఎక్కడో కాలి.. అతనికి పుల్ వర్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రియాంక ఆగ్రహం... పబ్లిసిటీ ఆపేయాలని హుకుం జారీ చేసి లీగల్ నోటీసు పంపించింది.
తన గురించి గాని..తన ఫ్యామిలీ గురించి గాని ఎక్కడైనా కనపడితే తోలు తీస్తానంటూ వార్నింగిచ్చింది. అయితే అసీమ్ మర్చంట్ మాత్రం టేకిట్ ఈజీ అంటున్నాడు. తాను తీసేది ప్రియాంక మేనేజర్‌గా చేసిన ప్రకాష్ జాజు స్టోరీ అని తెలివిగా చెబుతున్నాడు. అందులో సందర్భాన్ని బట్టి ప్రియాంక పాత్ర వచ్చిపోతుందే తప్ప.. ఆమెను కించపర్చే విధంగా ఎక్కడా ఉండదని స్పష్టం చేస్తున్నాడు. సినిమా విషయాలు బాగా తెలిసిన ప్రియాంక మాత్రం అసీమ్‌ను నమ్మే పరిస్థితి లేదని తెగేసి చెబుతోంది.
అయితే ప్రియాంక ప్రియుడు మాత్రం చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగు జరపకుండానే.. పుల్ పబ్లిసిటీ వచ్చిందని, ఇక తన సినిమాకు బడ్జెట్ ప్రాబ్లెమ్ ఉండదని భలే ఆనంపడిపోతున్నాడు. అయితే ఎట్టి పరిస్థితిల్లో సినిమాను ఆపేది లేదని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ప్రియాంక మాత్రం తన ఇమేజ్‌కు ఎక్కడ డామేజ్ అవుతుందోననే బెంగతో రాత్రులు నిద్రపోవటం లేదని భాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చివరకు పాత ప్రియుడితో.. కలిసిపోయి, సర్థుకుపోతుందో లేక.. ప్రియుడి పై పోరాటం చేస్తుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more