Pawan fans mahesh fans war in social media

pawan fans fire on mahesh teaser, mahesh fans fire on pawan, social media war, mahesh movie aagadu teaser, pawan fans vs mahesh fans, pawan kalyan, mahesh babu.

pawan fans-mahesh fans war in social media

ఫ్యాన్స్ సోషల్ వార్!

Posted: 06/04/2014 05:56 PM IST
Pawan fans mahesh fans war in social media

దర్శకులు , రైటర్లు రాసే పంచ్ డైలాగులతో.. ఫ్యాన్స్ సోషల్ యుద్దం చేస్తుకుంటున్నారు. అభిమానులు ఆనందంగా ఉండటానికి .. ఆయా హీరోలు. పంచ్ డైలాగులు చెబుతుంటారు. అది కథ డిమాండ్ చేసిందో, కావాలని రైటర్ రాసారో తెలియదు గానీ.. మొత్తం సినిమాలో హీరోగారి పంచ్ డైలాగుల మీద సినిమా మొత్తం ఆధారపడి ఉండే స్థాయికి ..టాలీవుడ్ దిగజారిపోయింది.

అది అభిమానుల పాలిట యమపాశంగా మారింది. ఏ సినిమా డైలాగు రాస్తే. ఏ హీరో అభిమానులు రాళ్లు వేస్తారోనని భయంతో.. టాలీవుడ్ రైటర్స్, నిర్మాతలు , దర్శకులు హడలి చస్తున్నారు. మూడు రోజులలో సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ఉంటే మరోపక్క ఆ టీజర్ మాత్రం పవన్-మహేష్ ఫాన్స్ మధ్య సోషల్ వార్ కు తెరతీసింది. ఈ యుద్దం ఇప్పడు టాలీవుడ్ పెద్ద కొంపలకు అంటుకునే విధంగా ఉంది.

సింహాలు, పులులు డైలాగ్ తమ హీరోను ఉద్దేసించేనని పవన్ అభిమానులు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటే.. మహేష్ అభిమానులు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఇక మీ హీరో టీజర్ మా హీరో సినిమాను కాపీ కొట్టినట్లుగా ఉందని పవన్ అభిమానులు రెచ్చిపోతుంటే.. తమ హీరోకు ఆ అవసరం లేదని మీ హీరోనే బాలీవుడ్ నుండి పట్టుకోస్తాడని మహేష్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.

అంతేకాదు మా హీరో చేసిన సినిమాలనే హిందీ వాళ్లు రీమేక్ చేసుకుంటుంటే.. హిందీ సినిమాలని మీ హీరో ఇక్కడకు తీసుకొచ్చి కాపీ కొట్టుకుంటాడని 'దబాంగ్-గబ్బర్ సింగ్;, 'పోకిరి-'వాంటెడ్' సినిమాలను గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. అభిమానుల మద్య అడ్డుగోడలు ఏర్పాడుతుంటే.. హీరోలు మాత్రం హాయిగా.. షూటింగ్స్ లో బిజీ బీజీగా ఉన్నారు. ఈ సోషల్ యుద్దం ఎంత వరకు వెళ్లి ఆగుతుందో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles