Sonakshi sinha like to tollywood heroes

sonakshi sinha like to tollywood heroes

sonakshi sinha like to tollywood heroes

సోనాక్షి కి నిద్రలేకుండా చేస్తున్న టాలీవుడ్ హీరోలు!

Posted: 06/03/2014 11:51 AM IST
Sonakshi sinha like to tollywood heroes

సొట్ట బుగ్గల చిన్నదాని మనసును మన టాలీవుడ్ హీరోలు లాగేస్తున్నారని తెగ గోల చేస్తుతుంది.. బాలీవుడ్ బంతిపువ్వు లాంటి పిల్ల సోనాక్షి. అందం, అభినయం, గాంభీర్యం, కొంటెతనం, అన్ని సోనాక్షిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆమెను వాడుకున్న వారికి వాడుకున్నంత అనే మాటలు బాలీవుడ్ లో ఘనంగా వినిపిస్తున్నాయి.

వెన్నల రాత్రి పుట్టిందో, లేక సూర్యుని కిరాణాల వెలుగులో పుట్టిందో తెలియదు గానీ.. నూనుగు మీసాలు పుట్టిన వాడి నుండి.. మీసాలు తెల్ల బడ్డ వారి దాగా.. అందరి గుండెల పై.. సోనాక్షి గుడి కట్టుకుంది. నిన్నటి వరకు బాలీవుడ్ వాసులకే సొంతమైన సోనాక్షి.. ఇక నుండి తమిళ తంబీలకు సోనాక్షి దాల్ రూచి ఏమిటో చూపించటానికి సిద్దమైంది.

sonakshi-like-to-tollywood-heroes-2

అదీ కూడా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రొమాన్స్ చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. లింగా సినిమాతో తమిళ తెరపై సోనాక్షి తన సౌందర్య రాశులను చూపించటానికి సై అన్నట్లు తెలుస్తోంది. అసలే సాంబరు తాగే తమిళ తంభీలు .. ఇక బాలీవుడ్ దాల్ దొరికితే వదిలిపెడతారా అని సోనాక్షి ని అడిగితే.. సొట్ట పడిన బుగ్గలను.. పైకి చూపిస్తూ.. నేను ఉన్నది అందుకే కదా. దొరికిన కాడ దోసుకోవాలి, దొరకని కాడ ..దాసుకోవాలి అనే విషయం మీకు బాగా తెలుసు. ఒక్క రజనీకాంత్ తోనే కాదు.. నాకు దొరికిన ఏ కుర్ర హీరోలను వదిలిపెట్టనని అంటుంది.

సోనాక్షి సూర్యతోనూ నటించాలని ఉందని తెలిపింది. అంతేకాదు తన మనసును టాలీవుడ్ కూడా లాగుతోందని సోయగాలు పోతూ చెప్పింది. ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రిన్స్ మహేష్ బాబు, మాస్ మహరాజా రవితేజతో నటించేందుకు సై అంటోంది. అంటే త్వరలో ఈ భామ టాలీవుడ్-లోనూ నటించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.. అంటే మన హీరోలు కూడా సోనాక్షి కి నిద్రలేకుండా చేస్తున్నారనే విషయం బాగా అర్థమవుతుంది. త్వరగా సోనాక్షి కోరిక తీరాలని కోరుకుందాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles