Jr ntr special birthday gifts to fans

Jr.Ntr Special Birthday Gifts, Jr nrt two gifts to fans, Rabasa film first look, Puri Kumestha film start

pecial Gifts To Jr.Ntr on his Birthday Jr.Ntr Birthday is on 20th of this month. This birthday will be memorable one for him. The reason behind

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్పెషల్ గిప్ట్స్

Posted: 05/07/2014 03:51 PM IST
Jr ntr special birthday gifts to fans

జూనియర్ ఎన్టీఆర్ ఈసారి తన పుట్టిన రోజు నాడు తన ఫ్యాన్స్ కి రెండు గిప్ట్ లు ఇవ్వబోతున్నాడు. మే 20వ తేదీన ప్రస్తుతం తాను నటిస్తున్న ‘రభస ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయడమే కాకుండా, తాను తదుపరి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం ఈయన నటిస్తున్న ‘రభస ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సమంతా, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘కందిరీగ ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జూలైలో ప్రేక్షకుల ముందకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక పూరి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు టైటిల్ గా ‘కుమ్మేస్తా ’ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. గతంలో వీరిద్దరి మధ్య కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ అట్టర్ ప్లాప్ తరువాత వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఎన్టీఆర్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.                                                                                                         కెయన్ఆర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles