Tamannaah high remuneration for guest roles

Tamannaah high Remuneration for Guest Roles, Tamannaah Tamil films, Nanbenda tamil movie, Tamannaah guest roles, Tamannaah in Udayanidhi Stalin movie, Bellamkonda srinivas movie, Tamannaah 20 Lakhs per day

Tamannaah high Remuneration for Guest Roles, Tamannaah Tamil films, Nanbenda tamil movie, Tamannaah guest roles, Tamannaah in Udayanidhi Stalin movie, Bellamkonda srinivas movie, Tamannaah 20 Lakhs per day

ఒక్క రోజు వస్తే 20 లక్షలు

Posted: 05/07/2014 06:37 PM IST
Tamannaah high remuneration for guest roles

మిల్కీ బ్యూటీ తమన్నా మళ్ళీ ఫాంలోకి వచ్చినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో భారీ ప్రాజెక్టుతో పాటు,  బాలీవుడ్ లో, కోలీవుడ్ లో నటిస్తూ క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్లో తమ్మూని ఏదైనా సినిమాల్లో గెస్ట్ రోల్ చేయమంటే తన రేటును అమాంతం పెంచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎందుకంటే ఆమెకున్న స్టార్ ఇమేజ్ అలాంటిది మరి. ఇలాంటి స్టార్ డమ్ నే దర్శక నిర్మాతలు చిన్న సినిమాల్లో వాడుకోవాలని చూస్తారు. అందుకు తగ్గట్లే వారు పారితోషికం డిమాండ్ చేస్తారు. ఇటీవల ఈ అమ్మడు బెల్లం కొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ వీవీ వినాయక్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఓ పాటలో ఆడి పాడినందుకు అక్షరాల ఇరవై లక్షలు తీసుకుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఇటీవలే వీరం చిత్రంతో తమిళ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ భామ ప్రస్తుతం అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనే ప్రయత్నాల్లో వుంది. గతంలో కొన్ని తమిళ సినిమాలు చేసిన ఈ సుందరి తెలుగులో అవకాశాల పరంగా బిజీగా మారడంతో కోలీవుడ్‌లో ఎక్కువగా నటించలేకపోయింది. ఇప్పుడు తమిళంలో ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న తాజా సినిమాలో తమన్నా ‘సినిమా నటి ’ గా గెస్ట్ పాత్ర చేసింది.

ఇందుకోసం ఒకరోజు షూటింగులో పాల్గొన్నందుకు ఇలా ఇరవై లక్షలు చార్జ్ చేసిందట. ఈమె పాత్ర వల్ల సినిమాకు హైప్ వస్తుందని భావించిన దర్శక నిర్మాతలు ఆమె అడిగినంత సమర్పించుకున్నారట. మరి ఏ ఇండస్ట్రీ వారైనా తమ్మూని ఒక్క రోజు గెస్ట్ గా బుక్ చేసుకోవాలంటే ఇరవై లక్షలు చేతిలో పట్టుకోవాల్సిందే మరి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles