Sj surya ropes in renu desai film

Vaishali Samant, SJ Surya, Renu Desai, Puli, Kushi, music director SJ Surya, Ishq Wala Love movie,

Renu tweeted about the recording. She wrote, Just recorded a song with The Vaishali Samanth,super music by director SJ Surya(yup he composed 2songs for IWL).

పవన్ మాజీ భార్య ఆ దర్శకుడితో...

Posted: 05/07/2014 03:29 PM IST
Sj surya ropes in renu desai film

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు ట్విట్టర్ ద్వారా మరోసారి వార్తల్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయి పుణెలో పిల్లలతో ఉంటున్న రేణుదేశాయ్ మరాఠిలో సినిమాలు చేస్తూ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

ఆ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో మలి సినిమాకు సిద్దం అయ్యింది. ‘ఇష్క్ వాలా లవ్ ’ పేరుతో  తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహిస్తుందట. అంతే కాదండోయ్ తన భర్త నటించిన ‘‘ఖుషీ ’’ సినిమా దర్శకుడు ఎస్.జె. సూర్య కూడా దీనికి పనిచేస్తున్నాడట.

రేణుకు కావాల్సిన దర్శకత్వ సాయం చేయడమే కాకుండా, రేణు కోరిక మేరకు రెండు పాటలకి మ్యూజిక్ అందించాడట. వైశాలి సమంత్ పాడిన ఈ రెండు పాటల రికార్డింగ్ కూడా అయిపోయింది అంటూ రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఖుషీగా వెల్లడించింది. దర్శకురాలిగా రేణు ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles