Dhoom 3 crosses rs 100 crore mark in three days

dhoom 3, aamir khan, abhishek bachchan, uday chopra, katrina kaif, rs 100 crore club, 3days collections,

As expected Aamir Khan starrer big-budget action thriller -Dhoom 3- has created a record and has managed to mint more than Rs 100 crore in just three days of its release.

ధూమ్ -3 రికార్డు కలెక్షన్లు

Posted: 12/24/2013 05:49 PM IST
Dhoom 3 crosses rs 100 crore mark in three days

రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది బాలీవుడ్. ఒక సినిమాను మించి మరో సినిమా రికార్డు వసూళ్ళు సాధిస్తుంది. మొన్నటి వరకు తొలి వారంలో 100 కోట్ల రూపాయలు సాధిస్తే రికార్డుగా చెప్పుకునే బాలీవుడ్ ఇక మూడు నాలుగు రోజులు చాలని నిరూపించింది అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ధూమ్-3 చిత్రం.

విడుదల అయిన మూడు రోజుల్లోనే 107 కోట్ల రూపాయలను వసూలు చేసి, గతంలో రికార్డులు క్రియేట్ చేసిన బాలీవుడ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నెల 20వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం తొలి రోజు 36 కోట్లు వసూలు చేయగా, రెండో, మూడో కూడా భారీగా వసూళ్ళు సాధించి 100 కోట్ల మార్కును దాటింది.

ఈ సినిమా వసూళ్ళతో గతంలో షారూఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ తొలి వారంలో వసూలు చేసిన 100.35 కోట్ల రికార్డు కనుమరుగు అయ్యింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమిళం, తెలుగులలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ చిత్ర కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా కూడా  భారీగా వసూలవుతున్నాయి. దీంతో ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసే బాటలో ధూమ్-3 పయనిస్తోంది. ముందున్నది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ చిత్రం 500 కోట్ల మార్కు దాటడం పెద్ద విషయమేమి కాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles