Asin in pawan upcoming film gabbar singh 2

asin in gabbar singh 2, asin-pawan kalyan, gabbar singh 2, gabbar singh 2 heroine, pawan kalyan romance with asin, sampath nandi

Annavaram was a flop which came with the same combination of Pawan and Asin. But he again chose for Gabbar Singh-2.

ఆసిన్ తో పవన్ మరోసారి జతకట్టనున్నాడా ?

Posted: 12/20/2013 02:52 PM IST
Asin in pawan upcoming film gabbar singh 2

ఇండస్ట్రీలోకి రోజు రోజుకు కొత్త భామలు దిగుమతి అవుతున్నా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ పాత భామతోనే నటించడానికి సిద్దం అవుతున్నాడా అంటే మలయాళ భామ ఆసిన్ ట్వీట్స్ ని బట్టి తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుండి దక్షిణాదిని వదిలి బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ మొదటి సినిమా ‘గజిని’తో సూపర్ హిట్ కొట్టినా, తరువాత ఆశించినన్ని అవకాశాలు రాక కష్టంగా కాలం వెల్లదీస్తున్న ఈ భామకు దక్షిణాది నుండి బంపర్ ఆఫర్ తగిలిందని అంటున్నారు.

ఆమె హిందీలో ‘మేరీ అప్నే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మినహా అసిన్ చేతిలో వేరే సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ‘గబ్బర్‌సింగ్ 2’ సినిమాలో ఈమెను నటించమని ఆ చిత్ర యూనిట్ సంప్రదించింట. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది కూడా. అయితే అందులో నటించడానికి ఒప్పుకుందో లేదో మాత్రం చెప్పలేదు. టాలీవుడ్ జనాలు మాత్రం ఎలాగు తనను సంప్రదించారని చెప్పిన ఈమె నటిస్తుందో లేదో విషయం చెప్పకపోవడంతో కాస్తంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఆసిన్ చెప్పింది నిజమైతే ఆమె పంట పండినట్లే. గతంలో ‘అన్న వరం ’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఆడిపాడిన విషయం తెలిసిందే. మరి ఆసిన్ పబ్లిసిటీ కోసం ట్వీట్ చేసిందా ? లేక నిజంగానే మొన్న ఈమెను సంప్రదించారా అనే విషయం త్వరలో తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles