Trisha new ambassador of ccl team

Actress Trisha Krishnan, Chennai Rhinosteam,CCL,ambassador,Trisha,Celebrity Cricket League

Actress Trisha Krishnan ambassador of the Chennai Rhinos team for the upcoming fourth edition of the Celebrity Cricket League (CCL).

చెన్నై సోయగం బ్రాండ్ అంబాసిడర్ గా

Posted: 12/20/2013 11:23 AM IST
Trisha new ambassador of ccl team

సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న భామలు నలుగురి కళ్ళలో పడాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పబ్లిసిటీ తెచ్చే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదులుకోరు. ఇప్పుడు అదే పనిచేస్తుంది చెన్నై సోయగం త్రిష. తెలుగు, తమిళం, మళయాలం భాషలను చుట్టేసి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈ అమ్మడు త్వరలో జరగబోయే సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ అమ్మడు చెన్నై రైనోస్ టీమ్ ప్రచారకర్తగా వ్యవహరించబోతుంది. చెన్నై జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా మిల్కీ బ్యూటీ తమన్నాతో పాటు పలువురి పేర్లను పరిశీలించినా ఆ అవకాశం ఈ చెన్నై సోయగానికే దక్కడంతో ఇఫ్పుడు తెగ ఆనందపడింది. ఎందుకంటే ఆ టోర్నీకి పలు ఇండస్ట్రీల నుండి హీరోలు, దర్శక నిర్మాతలు వస్తారు. అక్కడ కాస్త తన అందాలను ఒలకబోస్తే ఒకరు కాకపోతే ఒకరు ఛాన్స్ ఇవ్వకపోతారా ? ఎందుకివ్వరూ ? ఇస్తారు. చెన్నై బ్యూటీ త్రిషను ఎంపిక చేసినట్లు చెన్నై రైనోస్ డెరైక్టర్ శ్రీకాంత్ బాబు వెల్లడించారు.

తమ టీమ్ ప్రచారకర్తగా త్రిషను నియమించడం సంతోషకరంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. అన్నట్లు ఈ అమ్మడు కన్నడలో ఓ చిత్రం చేస్తుంది. పునీత్ రాజ్‌కుమార్ సరసన నటిస్తున్నారు. అక్కడ ఏ మాత్రం పేరు సంపాదించుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles