Pawan attarintiki daredi collects 20 cr in overseas

AD 20 cr in overseas, pawan kalyan AD, Pawan Kalyan, Attarintiki Daredi overseas, Attarintiki Daredi collections, Attarintiki Daredi,

The Trivikram's directorial has grossed 20 crores in the overseas market thereby becoming the highest Telugu grosser in foreign shores.

విదేశాల్లో పవన్ స్టామినా చూపించాడు

Posted: 10/30/2013 01:04 PM IST
Pawan attarintiki daredi collects 20 cr in overseas

పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్  సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి బ్యానర్ లో బీవీఎస్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ‘అత్తారింటికి దారేది ’ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ 100 కోట్లకు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా విదేశాల్లో ఏ సినిమా 20 కొట్లు వసూలు చేయగా ఒక్క అమెరికాలోనే 14 కోట్లకు పైగా వసూలు చేసింది. యూకె. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్ లాంటి దేశాల్లో మొత్తం కలిపి రూ. 6 కోట్లకు పైగా రాబట్టింది. ఈ విషయాల్ని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘మైత్రి ’ మూవీస్ సంస్థ వసూళ్ల విషయాలను అధికారికంగా ప్రకటించింది కూడా. ఇక ఈనెల 31 తేదీ నుండి 6 నిమిషాల కొత్త సీన్లు కలిపి విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా సాధిస్తున్న వసూళ్ళు, ఓవర్సీస్ లో రికార్డులను చూస్తున్న పవన్ అభిమానులు పవన్ సినిమా రేంజ్ ఏంటో తెలిసిందని అంటున్నారు. మరి ఈ సినిమా పైరసీ కాకుంటే ఇంకెన్ని వసూళ్లు సాధించేదో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles