Venkatesh nayan pair for new film radha

Venkatesh Nayan Pair For New Film Radha, Venkatesh Nayantara Pair, Venkatesh Nayantara New Movie Radha, Venkatesh Nayantara movies, Young director Maruthi, Director Maruthi movie Danayya, Venky Nayantara Pair, Actor Venkatesh, Actress Nayantara, Venkatesh Multi Starrer movie Masala, Venky Ram Masala Movie, Venky Ramcharan Multi Starrer Movie.

The pair of Venkatesh and Nayantara that was proved as a hit one like in Lakshmi and Thulasi can be seen again in the movie with a similar...

మరోసారి వెంకీ సరసన నయనతార

Posted: 10/30/2013 06:05 PM IST
Venkatesh nayan pair for new film radha

ఆ మధ్యన మళయాళ భామ నయనతార సీనియర్ హీరోల సరసన చేయనని, నాకు కుర్ర హీరోలు అయితేనే ఓకే అని దర్శక నిర్మాతలకు చెప్పకనే చెప్పింది. ఈ మధ్యన తమిళ సినిమాల మీద ఎక్కువ ద్రుష్టి పెట్టిన నయన్ ఆమె నటించిన సినిమాలు రికార్డు కలెక్షన్లు కూడా వసూలు చేశాయి.

కానీ అక్కడ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండంటంతో ఈమె మళ్లీ టాలీవుడ్ వైపు మళ్లింది. కానీ ఇక్కడ ఆమెకు కుర్ర హీరోలతో చేసే ఛాన్స్ ఇవ్వకపోవడంతో సీనియర్ హీరోలతోనైనా సరసం ఆడటానికి సై అంటుంది. గతంలో ఓసారి హీరో వెంకటేష్ సరసన ‘లక్ష్మి ’ సినిమాలో నటించి బాగానే కెమిస్ట్రీ పండించిన నయనతార ,  మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులకు ఆ రుచి చూపించడానికి సిద్దం అయింది. టాలీవుడ్ లో బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి త్వరలో వెంకటేష్ హీరోగా ‘రాధ ’ అనే సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.  ఇటు యువ హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు సీనియర్ హీరోలతో సినిమా తీసి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్న మారుతి ప్రస్తుతం అల్లు శిరీష్ తో ‘కొత్త జంట ’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘రాధ’ ను సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనల చేస్తున్నాడు. మరి లక్ష్మీ బావతో నయన్ మరోసారి ఏ రేంజ్ లో చేయబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles