Pawan joins gabbar singh 2 from december

Pawan joins Gabbar Singh 2 shooting, Pawan joins Gabbar Singh 2 from December,pawan kalyan,Power star,Sharat Marar,Power star Pawan Kalyan,Sampath Nandi

Pawan joins Gabbar Singh 2 shooting, Pawan joins Gabbar Singh 2 from December,pawan kalyan,Power star,Sharat Marar,Power star Pawan Kalyan,Sampath Nandi

గబ్బర్ సింగ్ -2 కి రెడీ అవుతున్న పవన్

Posted: 10/23/2013 12:06 PM IST
Pawan joins gabbar singh 2 from december

 

 

 

 

చాలా సంవత్సరాల తరువాత ‘గబ్బర్ సింగ్ ’ సినిమాతో ఫాంలోకి వచ్చి, అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ లో రికార్డులన్ని తిరగరాస్తూ... 100 కోట్ల క్లబ్బు వైపు వడివడిగా అడుగులు వేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పడు మరో ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తనకు ఘన విజయాన్ని అందించిన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాకు సీక్వెల్ లో సంపత్ నంది దర్శకత్వంలో చేయడానికి అంతా సిద్ధం చేసుకున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధం అయింది.

ఈ సినిమా షూటింగును ప్రారంబించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. డిసెంబర్ 2న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుందని సమాచారం. మొదట అనుకున్న ప్రకారం ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు అన్నీ సర్దుకోవడంతో డిసెంబర్ 2 న సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక పవన్ ఎంతో పట్టుబట్టి ‘గబ్బర్ సింగ్ -2 ’ అని టైటిల్ ను పెట్టించారు. అందుకు తగ్గట్లే దగ్గరుండి స్క్రిప్టు వర్క్ చూసుకుంటున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కొన్ని సంభాషణలు అందించనున్నాడని తెలుస్తుంది. ఈ టైటిల్ పెట్టుకోవడానికి అభ్యంతరాలు వచ్చినా, డబ్బులు చెల్లించి మరీ ఇదే టైటిల్ ని ఖరారు చేసుకున్న పవన్ ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించన్నాడని, దీనికి సంబంధిచిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ఆడిపాడేది ఎవరో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles