Sukumar to direct jr ntr

Jr.NTR to team up with Sukumar, Sukumar to direct Jr Ntr, Jr Ntr Sukumar Movie Details, Sukumar Jr Ntr Film, Jr Ntr next movies

An unnamed source says that Jr NTR would work with Sukumar soon. It seems that Sukumar has prepared a great story for NTR

సుకుమార్ తో జూనియర్ దోస్తీ

Posted: 10/24/2013 10:09 AM IST
Sukumar to direct jr ntr

గత కొంత కాలంగా ఎన్టీఆర్ నమ్ముకున్న దర్శకులు సరైన హిట్ ఇవ్వలేక పోవడంతో వైఫల్యాల బాట పట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు మించి హిట్టు ఇచ్చే దర్శకుడి కోసం వెతుకున్నాడు. మొన్నటి వరకు ఎవరికి పడితే వారికి అవకాశాలు ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు తనకో మంచి సినిమాను ఇవ్వండి అంటూ దర్శకుల వద్దకే వెళుతున్నాడు. ‘రామయ్యా ’ పరాజయం తరువాత ఎన్టీఆర్ తరువాత ప్రాజెక్టు ఏంటి ? ఎవరితో చేయబోతున్నాడు ?  నిన్న మొన్నటి వరకు మంచి ఫాంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ఆయన కోసం వేయిట్ చేశాడు.

కానీ ఆయన ఎటూ తేల్చలేకపోవడంతో ఇప్పడు మరో దర్శకుడు అయిన సుకుమార్ వైపు కన్నేశాడు. సుక్కు కూడా ప్రస్తుతం చేస్తున్న ‘1’ సినిమా పూర్తి కావడస్తుండటంతో మరో సినిమాకు సన్నద్దం చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నటించే చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన సుక్కు ఓ ప్రక్క చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూనే బడా హీరోలతో సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ తో చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని అత్తారింటికి దారేది సినిమాతో నాలుగు డబ్బులు వెనకేసుకొన్న నిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. కొరటాల శివ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles