Varma shocking teachers day tweet

Ram Gopal Varma, Ram Gopal Varma's SHOCKING Teachers Day Tweet, Ram Gopal Varma

Teachers Day today and as usual, several Bollywood celebrities took to the social networking sites to express their respective childhood experiences with their teachers and professors.

వర్మ సంచలన వ్యాఖ్యలు

Posted: 09/05/2013 07:34 PM IST
Varma shocking teachers day tweet

తాను అందరు నడిచే దారిలో నడిచే వాణ్ని కానని గతంలో చాలా సార్లు నిరూపించుకున్నాడు ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ నేడు గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా గురుపూజోత్సవం నాడు గురువులను పూజిస్తారు. కానీ మన వర్మ మాత్రం గురువును తన నోటికొచ్చినట్లు తిట్టేశాడు. గురుపూజోత్సవం పై ట్విట్టర్ లో కామెంట్స్ చేశాడు. ‘హ్యాపీ టీచర్స్ డే అని నేను అస్సలు చెప్పును. ఎందుకంటే నేనెప్పుడూ ఒక్క రోజు కూడా మా టీచర్లతో సంతోషంగా గడిపింది లేదు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులను సక్సెస్‌ఫుల్ కెరీర్ వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నట్లయితే.....మరి ఉపాధ్యాయులు సక్సెస్‌లేని ఆవృత్తిని ఎందుకు ఎంచుకున్నారు. సక్సెస్‌ఫుల్ డాక్టర్లు, సక్సెస్‌ఫుల్ ఇంజనీర్లు...ఇలా చాలా రంగాల్లో సక్సెస్‌లు విన్నాను. కానీ సక్సెస్‌ఫుల్ టీచర్ అనే పేరు మాత్రం నేనెప్పుడూ వినలేదు' అని వర్మ ట్వీట్ చేసారు. ‘కరణ్ జోహార్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్' మాదిరి ఎవరైనా ‘టీచర్స్ ఆఫ్ ది ఈయర్' సినిమా తీస్తే ఆ సినిమా డిజాస్టర్ ఆఫ్ ది ఈయర్‌గా నిలుస్తుంది. తక్కువ జీతాలతో పని చేస్తున్న టీచర్లను సంతోషంగా ఉంచడానికే విద్యార్థులు ఇలాంటి టీచర్స్ డేలు నిర్వహిస్తారు' అంటూ వర్మ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. మరి వర్మకు విద్యనేర్పింది గురువే అన్న విషయం మరిచాడా ? ‘చదువుకున్న వాడికన్నా చాకలి వాడు నయం ’ అన్న సామెత కరెక్టుగా సరిపోతుందేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles