Pawan kalyan to launch production

Pawan Kalyan to launch Production, awan Kalyans Creative Works,Gabbar Singh-2,Sharath Marar,searching , office space , Jubilee Hills,Journalist Colony,tollywood, industry talk

Pawan Kalyan to launch Production, awan Kalyans Creative Works,Gabbar Singh-2,Sharath Marar,searching , office space , Jubilee Hills,Journalist Colony,tollywood, industry talk

పవన్ ప్రొడక్షన్స్ రాబోతుంది

Posted: 09/06/2013 11:24 AM IST
Pawan kalyan to launch production

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు, హీరోలు సొంత ప్రొడక్షన్ సంస్థలు పెట్టుకొని మల్టీ పర్పస్ బిజినెస్ లు చేస్తూ బిజీ  అయిపోతున్నారు. ఒకదాంట్లో కాకపోయినా, ఇంకొదాంట్లో లాభం రాకపోతుందా అనే ఉద్దేశ్యంతో చేస్తున్నారో కానీ ప్రొడక్షన్ సంస్థల మీద పొడక్షన్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. మొన్నటికి మొన్న దర్శకుడు సుకుమార్ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభిస్తే... ఇప్పుడు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రొక్షన్ సంస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈయన ఎప్పటి నుండో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నా ఇప్పుడు అవి కార్యరూపం దాల్చబోతున్నాయి. ఈయన ఇప్పుడు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ సినీ వర్క్స్ ’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్దపడి అందుకోసం హైదరాబాదు జూబ్లీ హిల్స్ ఓ ఆఫీసు కోసం వెతుకున్నాడని సమాచారం. జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీ అంటే పవన్ ఇష్టపడుతున్నాడు. దాంతో, ఆ ప్రాంతంలోనే పవన్ అభిరుచికి తగ్గా ఆఫీసు కోసం ఆయన స్టాఫ్ వెతుకుతున్నారట. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ సినీ వర్క్స్ బేనర్ పై త్వరలో గబ్బర్ సింగ్ 2, కోబలి చిత్రాల నిర్మాణ బాధ్యతలను సన్నిహితుడైన శరత్ మరార్‌కు అప్పగించినట్టు టాక్. అంతే కాకుండా ఇక సినిమాకు, అభిమానులకు సంబంధించిన పనులను ఆఫీసు నుండే చూడాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే తన మంచి మనస్సుతో పలువురిని ఆదుకున్న పవన్ ఈ ప్రొక్షన్స్ పై మరికొందరికి దారి చూపిస్తాడని అనడంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles