Junior ntr next filims acting with six directors

Junior Ntr next filims Acting With six Directors, tollywood, jr ntr ramayaa vasthavayya movie, junior ntr, koratala shiva, mirchi

Junior Ntr next filims Acting With six Directors, tollywood, jr ntr ramayaa vasthavayya movie, junior ntr, koratala shiva, mirchi

యంగ్ టైగర్ ఆరుగురు దర్శకులతో

Posted: 08/15/2013 01:15 PM IST
Junior ntr next filims acting with six directors

టాలీవుడ్ లో యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అందరి హీరోల కన్నా ఢిపరెంటు రూట్లో వెళుతుంటాడు. ఏ దర్శకుడు హిట్ సినిమా ఇస్తాడో వారితో సినిమాకు కమిట్ అవుతుంటాడు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ‘కందిరీగ ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో  ‘రభస ’ చిత్రం షూటింగులో కూడా పాల్గొంటున్నారు. వీరి చిత్రాలే కాకుండా త్రివిక్రమ్,సుకుమార్, వక్కంతం వంశీ చిత్రాలుకు కూడా ఎన్టీఆర్ ఓకే చేసారు. ఇఫ్పుడు తాజాగా ‘మిర్చి ’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను కూడా ఓకే చేశాడని టాలీవుడ్ సమాచారం. టాలీవుడ్ లో హిట్ దర్శకులను రిజర్వ్ చేసుకుంటాడని పేరున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఆరుగురు దర్శకులకు ఓకే చెప్పాడని అంటున్నారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న మరో సమాచారం ప్రకారం... శివ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మించే చిత్రం ఉంటుందని వార్తలు వచ్చినా, అది అనుకోని విధంగా ఆగిపోవడంతో అదే కథను ఇప్పుడు ఎన్టీఆర్ కు చెప్పి ఒప్పించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కథ వినగానే వెంటనే ఎన్టీఆర్ ఓకే చేసాడని చెప్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మాణం కానుంది. మహేష్ బాబుతో కూడా ఓ చిత్రం చేయనున్న కొరటాల శివ రామ్ చరణ్ కి వినిపించిన కథను ఏ హీరో తీస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles