Ram charan teja spend 2 crores for on one action scene for zanjeer

Ram Charan teja Spend 2 Crores, Rs 2 crore set burnt for one scene in Zanjeer, Ram Charan Teja, Shruti Haasan, Kajal, Yevadu Theatrical Trailer

Ram Charan teja Spend 2 Crores For On One Action Scene For Zanjeer, Rs 2 crore set burnt for one scene in Zanjeer

2 కోట్లు అయింద

Posted: 07/27/2013 08:06 PM IST
Ram charan teja spend 2 crores for on one action scene for zanjeer

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలోని యాక్షన్ సీన్లకు దర్శక, నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టడం కూడా సినిమాకు స్టేటస్ సింబల్ గా చెప్పుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి బాలీవుడ్ లో నటించిన జంజీర్ చిత్రానికి నిర్మాతలు హాలీవుడ్ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే భారీ బడ్జెట్ పెట్టారు. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ఈ సీన్ కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు.

 

ముంబయిలోని ధారావి మురికివాడలని ప్రతిబింబించేలా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో వీటి కోసం భారీ సెట్స్ వేశారు. ఇందులో భాగంగా రెండువేల గుడిసెలు వేశారు. ప్రధాన తారాగణం తో బాటు, 120 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ యాక్షన్ దృశ్యాల చిత్రీకరణలో పాల్గొన్నారు. చివరికి సెట్స్ తగలబడుతుండగా క్లైమాక్స్ ఫైట్ తీశారట. వీటిని 7 కెమెరాలతో షూట్ చేశారు. సెట్స్ నిర్మాణంతో కలిపి ఈ మొత్తం చిత్రీకరణకు 2 కోట్లు అయిందట. ఈ సీన్ తో సినిమాకు ఎంత ప్రాముఖ్యత చేకూరుతుందో చెప్పలేం కానీ పైసలను నీళ్లలా ఖర్చు చేశారని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే భారీ రేటుకు అమ్మడుడైన విషయం తెలిసిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles