Puri jagannath says sorry to all pawan fans

puri jagannath director, pawan kalyan hero, puri dialogues, puri satire on pawan

Puri Jagannath says sorry to all Pawan Kalyan fans, Puri Jagannath says sorry to all Pawan Kalyan fans

పవన్ ఫ్యాన్స్ కి సారీ చెప్పాడు

Posted: 06/04/2013 09:58 AM IST
Puri jagannath says sorry to all pawan fans

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పూరీ జగన్నాథ్ పై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నాడు. అంతేకాకుండా పవన్ పూరీని టార్గెట్ చేశాడని కూడా అనుకుంటున్నారు. కారణం బన్నీ-పూరీ కాంబినేషన్లో ఇటీవల వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో... ’ సినిమాలో పూరీ జగన్నాథ్ రాసిన ఓ డైలాగ్ పవన్ ఫ్యాన్స్ ని కించపరిచేలా ఉండటమే. ఈ సినిమా ‘ప్రతి ఎధవా పవన్ కళ్యాణ్ ఫ్యానే ’ అనే డైలాగ్ ఉంది. ఈ సినిమా చూసిన పవన్ కళ్యాణ్ ప్యాన్స్ పూరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ డైలాగును తొలగించాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని తూ.గో. జిల్లాకు చెందిన భీమవరం పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితి గమనించిన పూరీ ట్వీట్ చేస్తూ...  ‘పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా బాధపడితే వాళ్లందరికీ సారీ చెప్తున్నాను. ఆ డైలాగ్ చూసి చిరంజీవిగారు నవ్వుకున్నారు, అల్లు అరవింద్ గారు ఎంజాయ్ చేసారు. బన్నికి ఎంతో నచ్చింది. అది కేవలం కాంప్లిమెంట్ మాత్రమే. అది బన్ని ..పవన్ కి పెద్ద ఫ్యాన్ అని మాత్రమే చెప్తుంది. ఐన సరే మీరు భాధపడితే రియల్లీ సారి. ఇది మనస్సులో పెట్టుకోవద్దు. భీమవరం వచ్చినప్పుడు నన్ను హ్యాపిగ పలకరించండి. లవ్ యూ.. ’ అని రాశాడు. మరి దీనికి పవన్ ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles