Heroines no to balakrishna boyapati movie

Balakrishna, Boyapati Seenu, Simha, Ruler, Jayasimha

Heroines no to balakrishna boyapati movie

బాలక్రిష్ణకు హీరోయిన్లు కరువు

Posted: 06/04/2013 06:00 PM IST
Heroines no to balakrishna boyapati movie

నందమూరి నట సింహం బాలయ్య తన సినిమాల సంఖ్యను సెంచరీకి చేర్చాలనే తపనలో ఆ మధ్యన వరుస సినిమాల్లో నటించాడు. కానీ ఒక్క శ్రీరామ రాజ్యం తప్ప  ఏది హిట్టు కాకపోవడంతో ఆచితూచి కథలను ఎన్నుకుంటున్నాడు. గతంలో తనకు హిట్ ఇచ్చిన సింహా దర్శకుడు బోయపాటి శీనుతో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ చిత్రం ఎన్నడో పట్టాలు ఎక్కాల్సి ఉన్నా బాలయ్య రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగు ప్రారంభం కాలేదు. తాజాగా రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెగ్యులర్ షూటింగ్ ఈనెల 10 నుండి ప్రారంభం కాబోతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ని ఎంపిక చేయలేదు. ఈయనకు సరిపోయే హీరోయిన్లు లేకపోవడం ఒకటైతే, నడివయస్సు పై బడిన హీరో చేయడానికి ఏ అమ్మడు ముందుకు రావడం లేదట. దీంతో దర్శక నిర్మాతలు ముమ్మర వేటను సాగిస్తున్నారు. పనిలో పనిగా బాలీవుడ్ ముద్దుగుమ్మలను కూడా సంప్రందించే పనిలో ఉన్నారు. విద్యాబాలన్ అయితే బాలయ్య సరసన బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించబోతున్నారట. ఇటీవలే పెళ్ళి చేసుకున్న ఈ ఆంటీ గనుక బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకోకపోతే బాలయ్యకు హీరోయిన్స్ దొరకడం కష్టమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles