Young tiger bad sha shooting updates

young tiger bad sha shooting updates

young tiger bad sha shooting updates

11.gif

Posted: 08/14/2012 03:32 PM IST
Young tiger bad sha shooting updates

       యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' తెలుగు నాట కొత్త పుంతలు తొక్కేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం తమన్ మరో ప్రయోగంThaman_ee చేశాడు. ఇందులోని థీం సాంగ్ ను తాజాగా బ్యాంకాక్ లో రికార్డు చేశాడు. ఈ పాటను రంజిత్, రాహుల్ నంబియార్, సుచిత్ర గానం చేశారు. బ్యాంకాక్ ఫిల్హర్ మోనిక్ ఆర్కెస్ట్రాతో ఈ పాటను భారీ స్థాయిలో, వైవిద్యంతో కూడిన వాద్యపరికరాలతో రికార్డు చేసుకుని, తమన్ తిరిగి చెన్నయ్ చేరుకున్నాడు. ఈ పాట చాలా బాగా వచ్చిందనీ, దర్శకుడు శ్రీను వైట్ల దీనిని ఎంతగానో ఇష్టపడ్డారనీ తమన్ అంటున్నాడు.
       కాగా,  రేపటి (ఆగష్టు 15) నుంచి ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగు బ్యాంకాక్ లో జరుగుతుంది. హీరో, విలన్లపై యాక్షన్ ఎపిసోడ్ తో బాటు,  హీరో హీరోయిన్లపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను, ఓ పాటను అక్కడ చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. ఇందులో యన్టీఆర్ పక్కన కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ కనిపించని విధంగా యంగ్ టైగర్ ఇందులో రొమాంటిక్ లుక్ తో కనిపించబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tarakaratna and swtha basoo latest movie
Marriage rings cost nearly 9 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles