Tarakaratna and swtha basoo latest movie

tarakaratna and swtha basoo latest movie

tarakaratna and swtha basoo latest movie

19.gif

Posted: 08/14/2012 04:27 PM IST
Tarakaratna and swtha basoo latest movie

       కొత్త పెళ్లికొడుకు తారకరత్న తాజా చిత్రం 'విజేత' షూటింగ్ షురూ అయింది. ఈ ఉదయం హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లో ప్రముఖులtaraka_ee సమక్షంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇటీవలే రహస్య వివాహం చేసుకున్న తరువాత తారకరత్న చేస్తోన్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. తొలి సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ కొట్టాగా ... ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేయగా ... సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో వి.దొరస్వామిరాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో తారకరత్న జోడీగా శ్వేతాబసూ ప్రసాద్ నటిస్తోంది.
   ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ, ఈ సినిమా తన గత చిత్రాలకి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. తన పాత్రని దర్శకుడు అద్భుతంగా మలిచాడనీ ... కుటుంబ సమేతంగా అందరినీ అలరించేదిగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఇక దర్శకుడు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ బ్యానర్లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాననీ ... తారకరత్నతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనీ ... ఈ సినిమాతో తారకరత్న ఇమేజ్ పెరిగిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వక్తలంతా ఆశాభావం వ్యక్తం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Oscar music winner ar rahman on bolly wood screen
Young tiger bad sha shooting updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles