Stylish star allu arjun julayi hangama

stylish star allu arjun julayi hangama

stylish star allu arjun julayi hangama

17.gif

Posted: 08/08/2012 02:44 PM IST
Stylish star allu arjun julayi hangama

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘జులాయి’ ఆగడాలు రాష్ట్రవ్యాప్తంగా మొదలైపోయాయి. రేపు ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా బన్నీ julayi_innఅభిమానులు టిక్కెట్ల కోసం థియేటర్ల వద్దా, ఆన్ లైన్ లోనూ క్యూ కట్టరు. విడుదల అవుతున్న థియేటర్లను భారీ బ్యానర్లతో నింపేశారు. బన్నీ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం రేపు అంటే (గురువారం) విడుదల కానుంది. ఇంతకు ముందు అల్లు అర్జున్ ఏ చిత్రానికి లేనంతగా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మల్టీ ప్లెక్సుల్లో ఈ చిత్రం యొక్క టికెట్ల కోసం రద్దీ నెలకొంది. క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పదునైన మాటల పదజాలం, కామెడీ అల్లు అర్జున్ మార్క్ డాన్సులు ఈ చిత్రం పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సోనూ సూద్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ సూపర్ హిట్ కొడతానని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్స్ సాధించిన సంగతి విదితమే. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్ర ఆడియో సూపర్ హిట్ అయ్యి సినీ ప్రియుల నోళ్ల లో నానుతోంది. జులాయి చిత్రం లోని ఓ మధూ.. సాంగ్ మేకింగ్ ను ఈ దిగువ తిలకించవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ అతని బ్రుందం ఎంతో ఎంజాయ్ చేస్తూ ట్యూన్స్ కడుతున్నారో మీరో చూడండి..

...ఎవిఎన్కే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna in himmatwala movie
Sivaji gayitri movie gola gola  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles