గతంలో 'భార్యాభర్తల భాగోతం' సినిమాకు దర్శకత్వం వహించిన మహేష్‌కుమార్ తాజాగా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మహిమా పిక్చర్స్ పతాకంపై బుజ్జి పాండాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం తాజాగా యువసంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ ఆధ్వర్యంలో కీర్తన థియేటర్లో ఆరు పాటలను రికార్డింగ్ చేశారు. దిలీప్కోటి, దివ్వభార్గవి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వీరికిదే తొలి చిత్రం. గిరీష్‌కుమార్ పి.సుభాష్, రాజ్‌కుమార్, ప్రణయ్‌లు ఈ సినిమాద్వారా పరిచయం తెలుగుతెరకు పరిచయమవుతున్నారు.
ఇక ఈ చిత్ర కథాంశం ఏమిటంటే.. ఒకే కాలేజీలో చదువుకునే ఒక యువజంట సరదా కోసం విహారానికి వెళతారు. కానీ అక్కడ జరిగిన ఓ దుస్సంఘటన నుండి వారు ఎలా బయటపడ్డారనేది ఇతివ్రుత్తాంతం. ఇంతవరకు జరిగిన షూటింగ్‌తో నలభైశాతం టాకీపార్ట్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఆగస్టు మొదటివారం నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగనుంది.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చక్రి, సంగీతం : రాజ్‌కిరణ్, సహ నిర్మాత: రాళ్ళబండి శ్రీనివాస్.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more