Aswanidutt raviteja kajal latest movie

aswanidutt raviteja kajal latest movie

aswanidutt raviteja kajal latest movie

5.gif

Posted: 06/01/2012 03:50 PM IST
Aswanidutt raviteja kajal latest movie

   asw_i   ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో కుదేలైపోయిన ప్రముఖ నిర్మాత అశ్వనిదత్ తాజాగా నిర్మించబోయే సినిమాకు రంగం సిద్దమౌతోంది. రవితేజ హీరోగా దత్ నిర్మించబోయే 'సార్ వస్తారా' చిత్రం షూటింగు వచ్చే నెల 16 న ప్రారంభం కానుంది. పరశురాం దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు ఊటీలో మొదలవుతుంది. తొలి షెడ్యూలు షూటింగును అక్కడే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఎంపికైన సంగతి మనకు తెలిసిందే. ఆమె కూడా 16 నుంచే షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. దీనికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం కోసం తమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ను సిద్ధం చేశాడట. as
     వరుస పరాజయాలలో వున్న రవితేజ పక్కన ఈ చిత్రంలో నటించడానికి మొదట్లో కొంతమంది కథానాయికలు తిరస్కరించారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన అశ్వనిదత్ సినిమాలో హీరోయిన్లు నటించేందుకు వెనుకంజ వేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ విషయాన్ని అశ్వని దత్ కూతురు ఆమధ్య ఖండించారు. తమ వైజయంతీ మూవీస్ బ్యానర్ ఎంతో మంది ప్రముఖ హీరోయిన్లతో సినిమాలు నిర్మించిన సంస్థ అనీ, ఇలాంటి రూమర్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావటంలేదని పేర్కొంది.  మొత్తానికి ఈ సినిమా అయినా అశ్విని దత్ ను కష్టాల కడలి నుంచి ఒడ్డుకు చేరుస్తుందేమో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress kartika says
Actress tapsi agree for any types of films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles