Super star mahesh babu and samantha wedding

super star mahesh babu and samantha wedding

super star mahesh babu and samantha wedding

11.gif

Posted: 05/14/2012 05:57 PM IST
Super star mahesh babu and samantha wedding

      సూపర్ స్టార్ మహేష్ కు పెళ్లయిపోయింది కదా.. నమ్రతా ఊరుకుంటుందా అనుకుంటున్నారా.. ఈ విషయం కాసేపు పక్కన పెడితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, సమంతా జంట పెళ్లి పీటలు ఎక్కింది. పండితుల వేదమంత్రాల నడుమ... మంగళ వాయిద్యాలు మోగుతుండగా సమంతా మెడలో మహేష్ తాళికట్టాడు.samantha_inner ఈ అందమైన దృశ్యం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో ఆవిష్కృతమైంది. వీరిద్దరి పెళ్లి సన్నివేశాలను హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో 2 కోట్లతో వేసిన భారీ సెట్లో రాత్రి వేళల్లో చిత్రీకరించారు. ఈ షూటింగులో చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. దాంతో పెళ్లి సందడి చోటుచేసుకుని సీన్ అద్భుతంగా పండింది.
      వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ కుటుంబ కథా చిత్రం షూటింగు వేగంగా జరుగుతోంది. వెంకీ సరసన అంజలి,  మహేష్ పక్కన సమంతా ఇందులో జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో మల్టీస్టారర్ చిత్రాలకు మళ్లీ క్రేజ్ వస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raviteja forthcoming movie daruvu release on may 25th
Shraddha das is in a state of elation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles