Shraddha das is in a state of elation

Shraddha Das is in a state of elation

Shraddha Das is in a state of elation

19.gif

Posted: 05/14/2012 05:38 PM IST
Shraddha das is in a state of elation

      సీక్వెల్ మహరాణి శ్రద్దా దాస్ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. కారణం ఏమంటారా.. అందాల ఆరబోతకు తనకు ఎటువంటి పట్టింపులూ లేవని ఎంతగా రుజువు చేసుకుంటున్నప్పటికీ శ్రద్దాదాస్ కు  తెలుగులో ఒకటీ అరా సినిమాలు తప్ప పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ బెంగాలీ భామ, ఇప్పుడు మలయాళ చిత్రసీమలో అడుగుపెడుతోంది.a ప్రముఖ మలయాళ దర్శకుడు వినయన్ రూపొందించే చిత్రంలో నటించడానికి ఆమె తాజాగా సంతకం చేసింది.  'డ్రాకులా 3D' పేరుతో రూపొందే ఈ చిత్రాన్ని మలయాళంతో బాటు తెలుగు, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో కూడా అనువదించడానికి ప్లానింగ్ జరుగుతోంది. ఇది తన తొలి మలయాళ చిత్రమనీ, డ్రాకులా కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందనీ శ్రద్దా దాస్ చెబుతోంది.
      అంతేకాదు బహుబాషా చిత్రంలో నటించి ఏక్ ధమ్ వివిధ భాషల్లో తెరగేట్రం చేసేందుకు అవకాశం వచ్చి పడినందుకు ఈ అందాల భామ ఆనందపడిపోతోంది.  ఈ సినిమాకి ముఖ్య సాంకేతిక నిపుణులంతా విదేశాలకు చెందిన వారేనని ఆమె అంటోంది. ఇందులో ఇంకా ప్రభు, నాజర్, మోనాల్ గజ్జర్ వంటి ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. అయితే ఇకనైనా శ్రద్దా ఖాతాలో మంచి సినిమాలు పడాలని ఆశిద్దాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Super star mahesh babu and samantha wedding
Oo kodatara olikki padatara movie logo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles