Oo kodatara olikki padatara movie logo

oo kodatara olikki padatara movie logo

oo kodatara olikki padatara movie logo

21.gif

Posted: 05/14/2012 05:18 PM IST
Oo kodatara olikki padatara movie logo

     12  మోహన్ బాబు మీద సిల్లీ జోక్ పేల్చారు దర్శకరత్న. ''నిర్మాణ సమయంలో ఈ సెట్‌లోకి మోహన్‌బాబుని రానివ్వకపోవడం ఆమె చేసిన తెలివైనపని. ఒకవేళ మోహన్‌బాబుని రానిచ్చివుంటే... ఇంత పెద్ద సెట్‌ని వేయనిచ్చేవాడు కాదు. తను ఈ సెట్ కోసం చెక్‌పై సంతకం పెట్టిన ప్రతిసారీ ఉలిక్కిపడి ఉండేవాడు'' అంటూ చమత్కరించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా’ చిత్రం లోగో ఆవిష్కరణ కి హాజరైన ఆయన తొలి పోస్టర్ ని ఆవిష్కరించారు.
        బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో... మంచు మనోజ్, దీక్షాసేథ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా’. శేఖర్‌రాజా దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న ఈ సినిమా లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గంధర్వమహల్ సెట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలి పోస్టర్‌ని దాసరి, మలి పోస్టర్‌ని కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. 13
        ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సినిమాలోని కీలక పాత్రధారి బాలకృష్ణ మాట్లాడారు. ‘‘సాధారణంగా ఏ నిర్మాతైనా పేరుప్రఖ్యాతలు వచ్చాక ఇలాంటి భారీ సినిమా తీయాడానికి పూనుకుంటారు. కానీ లక్ష్మీప్రసన్న అలాకాదు. ఒక నమ్మకంతో ఈ సినిమా తీసింది. ఈ టైటిల్ విని, అందులో నేను నటిస్తున్నాను అని తెలియగానే... అందరికీ లేని ఉత్సుకత మొదలైంది. ఈ సినిమా ఆద్యంతం నేనుంటా. శ్రీరామరాజ్యం, ఊ కొడతారా... లాంటి సినిమాల్లో నటించడం ఓ వరంలా భావిస్తున్నాను’’ అని బాలయ్య చెప్పారు. సినిమాకు బడ్జెట్ మాత్రం బాగా పెరిగింది. రష్ చూశాక పెట్టిన డబ్బు మొత్తం వచ్చేస్తుందని నమ్మకం కుదిరింది’’ అని మోహన్‌బాబు అన్నారు.
       ఈ కథకు, ఇందులోని పాత్రలకు, ఈ గంధర్వమహల్‌కు ఉన్న సంబంధం ఏమిటో, ఎందుకింత భారీ సెట్ వేశామో రేపు సినిమా చూశాక మీకు అర్థమవుతుందని లక్ష్మిప్రసన్న అన్నారు. సుమారు ఆరున్నర కోట్ల భారీ వ్యయంతో ఈ సెట్ నిర్మించాం. మనోజ్ కెరీర్‌లోనే గొప్ప సినిమాగా ఇది నిలుస్తుంది.  జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని లక్ష్మి తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. ఈ నెల 18న గుంటూరులో వేడియో వేడుక జరుగనుంది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shraddha das is in a state of elation
23gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles