Rajani daughter aiswarya and dhanush movie 3 crisis

rajani daughter aiswarya and dhanush movie 3 crisis

rajani daughter aiswarya and dhanush movie 3 crisis

12.gif

Posted: 04/18/2012 03:33 PM IST
Rajani daughter aiswarya and dhanush movie 3 crisis

                    rajinikant_inn తెలుగు - తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన '3 ' సినిమా పరాజయం పాలైన విషయం మనకు తెలిసిందే. విడుదలకి ముందే 'కొలవెరి' పాటతో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ వేలంపాటకి కూడా సిద్ధపడి భారీ రేటును చెల్లించి, ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నారు. అయితే విడుదల తరువాత ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇటు తెలుగులోనూ, అటు తమిళ్ లోను బోర్లా పడింది. కొలవరి పాటపై కోటి ఆశలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోని దెబ్బతిన్నారు.      
              ఇక తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్న నట్టి కుమార్ కోట్ల రూపాయలను నష్టపోయారు. ఇదిలా ఉంటే, తన సినిమాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడమనేది రజనీకి మొదటి నుంచి అలవాటు. ఆ మధ్య 'బాబా' సినిమా విషయంలోనూ ఆయన ఇదే పని చేశారు.ai_dha_inn ఇప్పుడు ఆయన సలహా మేరకు '3 ' సినిమా బాధితులను ఆదుకోవడానికి కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ నడుం బిగించినట్టు తెలుస్తోంది. డిస్ట్రి బ్యూటర్లు నష్టపోయిన దాంట్లో కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుందని ఐశ్వర్య హామీ ఇచ్చిందని నట్టి కుమార్ చెబుతున్నాడు. ఈ సినిమాతో ధనుష్ కి ఇమేజ్ రాకపోయినా, ఈ సంఘటనతో రజనీ క్రేజ్ మరింత పెరిగిందనేది వాస్తవం.
                ఇదిలా ఉంటే.. దీనిగురించి మరో కథనం ప్రముఖంగా వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమా విషయంలో తనకు ఏమీ సంబంధం లేదని రజనీ ఘంటాపథం గా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రజనీకాంత్ తాజాగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు హక్కులు కొనుగోలు చేసిన నట్టి కుమార్ కూడా సదరు సినిమా వారిపై కంప్లైంట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ అన్ని తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకులు అంగీకరించరని మరోసారి రుజువైంది.  మొత్తానికి ఈ సినిమాను అధిక ధర చెల్లించి కొన్న డిస్టిబ్యూటర్లకు ఐశ్వర్య-ధనుష్ దయతో కొంత మేరైనా మేలు జరిగితే వారికి కొంత మేర వెసులుబాటు కలుగుతుంది. చివరకు ఏమౌతుందోమరి. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao going to make a movie on politics
Andhra pradesh high court issue notices to actress genelia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles