A small relief for alphansa in the vinodkumar murder case

a small relief for alphansa in the vinodkumar murder case

a small relief for alphansa in the vinodkumar murder case

10.gif

Posted: 04/05/2012 04:23 PM IST
A small relief for alphansa in the vinodkumar murder case

           cfalphonsa_inn వినోద్ కుమార్ మర్డర్ మిస్టరీ కేసుతో గత కొంత కాలంగా సతమతమైపోతోన్న అల్ఫాన్సా , తాజాగా వచ్చిన కోర్టు ఉత్తర్వులు ఉపశమనాన్ని కలిగించాయంటోంది. భర్తకి దూరమైపోయిన అల్ఫాన్సా ... వినోద్ కుమార్ తో సహజీవనాన్ని కొనసాగిస్తుండగా, అతను అనుమానస్పద పరిస్థితుల్లో మరణించాడు. డబ్బు కోసం వినోద్ కుమార్ ని అల్ఫాన్సాయే హత్య చేయించిందని అతని తల్లిదండ్రులు కేసు పెట్టారు.
             వినోద్ కుమార్ మరణంతో తనకి ఎటువంటి సంబంధం లేదని ఆమె ఎంతగా చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. మరో వైపున కేసు విచారణ జరుగుతోన్న తీరు ఆందోళన కలిగించడంతో, ఆమె ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడామె కోర్టు ఉత్తర్వులు తనకి అనుకూలంగా వచ్చాయంటూ ఓ ఇంటర్య్వూలో పేర్కొంది.
           ఈ ఉపద్రవాన్ని ఓ పీడకలగా మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాననీ, త్వరలోనే తిరిగి స్క్రీన్ పై కొస్తానంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసు నుంచి పూర్తిగా ఎప్పటికి అల్ఫాన్సా బయటపడుతుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karshma kapoor re entry into bollywood
A court case against kolaveri song in kerala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles