టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ విలువ మరింత పెరిగింది. దీంతో అతను మరో మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటి వరకు కేవలం మన రాష్ట్రం వరకే ఉన్న అతని మార్కెట్ ఇప్పుడు ఇండియా లెవల్ కి వెళ్లింది. ఇప్పటి వరకు మహేష్ బాబు మన రాష్ట్రంలోని వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. తాజాగా అతడు మల్టీనేషనల్ కంపెనీ అయినా థమ్సప్ సాఫ్ట్ డ్రింక్ కి ఇండియా లెవల్ కి అంబాసిడర్ గా డీల్ కుదుర్చుకున్నాడని సమాచారం. దీంతో మహేష్ మన రాష్ట్రం నుండి తొలిసారిగా నేషనల్ స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ దక్కించుకున్న హీరోగా ఘనత సాధించాడు.
ఇప్పటి వరకు థమ్సప్ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అక్షయ్ కుమార్ కాంట్రాక్టు ముగియడంతో... మహేష్ బాబుతో ఈ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటు సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ ఇటు వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించడంతో కూడా దూసుకుపోతున్నాడు. మొన్నటికి మొన్న సంతూర్ సబ్బు కంపెనీతో కూడా డీల్ కుదుర్చుకున్నాడు. రాష్ట్రంలోనే కాక రాష్ట్రం బయట కూడా రోజు రోజుకు పాపులర్ అవుతున్న మహేష్ బాబు వల్ల తమ కంపెనీ ఉత్పత్తులు మరింత పెరుగుతాయని ఆ కంపెనీ భావించి ఆయతో డీల్ కుదుర్చుకున్నట్లు మహేష్ బాబు సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
రాష్టం నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరో మహేష్ బాబే కావడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ పరిధిలోనే మహేష్ బాబు బ్రాండ్ విలువ కొన్ని కోట్లలో ఉంది. మరి నేషనల్ స్థాయిలో మహేష్ బాబు విలువ ఏ రేంజ్లో ఉంటుందో మరికొన్ని రోజుల్లో వెల్లడి కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more