బహుముఖ ప్రజ్ఞాశాలైన భారత జాతీయ నటుడు కమల్ హాసన్. అతను నటించే ప్రతి చిత్రమూ ఓ విభిన్నమే. ఇదే విషయం రుజువు చేస్తాయి అతని చిత్రాలు. ప్రస్తుతం ‘విశ్వరూపం’ చిత్రంతో తన నటనా విశ్వరూపాన్ని మరోమారు సరికొత్తగా ప్రేక్షకులముందు పెట్టాలని కమల్ ఉవ్విళ్లూరుతోన్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే ఈ చిత్రం అనంతరం మరో సందేశాత్మక చిత్రం తీసేందుకు ఆయన రెడీ అయిపోతున్నట్టు తెలుస్తోంది.
ఈ ధఫా అవినీతిపై సమరశంఖం పూరించేందుకు కమల్ హాసన్ సంసిద్ధులవుతున్నారు. గతంలో ఇదే అంశంపై ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘భారతీయుడు’ సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అవినీతిపై మరింత లోతుగా ఈ చిత్రం ఉండబోతుందని చిత్రవర్గాల సమాచారం.
ద్విభాషా చిత్రంగా రూపొందించాలని తలుస్తోన్న ఈ సినిమా దేశంలో ఎంత అవినీతి బట్టబయలవుతోన్నాకాని, అవినీతి పరులపై తీవ్రస్థాయిలో దండన ఉండటంలేదనే కథాంశంతో రూపొందిస్తారని వెల్లడి. ప్రస్తుతానికి కమల్ హాసన్ తానే దర్శకత్వం వహించి నటిస్తోన్న‘విశ్వరూపం’ చిత్రం తుదిదశ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఆ మూవీ అనంతరం అవినీతి ప్రక్షాళనకు సంబంధించిన చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
…avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more