Great director rajamouli latest movie eega

great director, rajamouli, latest movie, eega, is coming in a thunder way

great director rajamouli latest movie eega is coming in a thunder way

5.gif

Posted: 01/24/2012 11:36 AM IST
Great director rajamouli latest movie eega

         6 చరిత్ర సృష్టించబోతుందా రాజమౌళి ఈగఅంటుంటే అవుననే అంటున్నాయి. పరిశ్రమ వర్గాలు. మూస ధోరణికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ అంటోంది. తెలుగు చలన చిత్ర చరిత్రను తిరగరాసేలా మగథీరచిత్రాన్ని ఎంతో సాహసోపేతంగా తెరకెక్కించారు ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి. ఈ చిత్రం టాలీవుడ్ లోనే కాదు యావత్ దక్షిణాది సినిమానే కొత్త పుంతలు తొక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాజమౌళి అదే ధీమా, విశ్వాసంతో రూపొందిస్తున్నారు ఈగసినిమా.

          యావత్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న హాలీవుడ్ మూవీ అవతార్స్థాయిలో ఈ చిత్రం నిలుస్తుందని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఇది ఒక ప్రయోగాత్మక మూవీ అని చిత్ర షూటింగ్ ప్రారంభంలో స్వయంగా రాజమౌళి వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ తారాస్థాయిలో ఉండబోతున్నాయి. అలా అని ఇది యానిమేషన్ మూవీ మాత్రం కాదు. ఇది ఒక ప్రత్యక్ష యాక్షన్ మూవీగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఈగ ప్రధాన భూమిక వహించబోతుంది. విలన్ చేతిలో హతుడైన హీరో ఈగగా పునర్జన్మెత్తి పగతీర్చుకోవటం ఈ సినిమా ప్రధానాంశం.

          ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హిందీలో నిర్మించిన ఫూంక్, రక్తచరిత్ర 1,2 లలో నటించిన సుదీప్ ఈ సినిమాతో తెలుగులో ఫుల్ ప్లెడ్జ్ డ్ గా నటిస్తున్నారు. నాని, సమంతా లీడ్ రోల్స్ కాగా, సుదీప్ నెగెటివ్ రోల్ చేస్తున్నారు, సంతానం తదితరులు ఇతర ప్రధాన తారాగణం.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal haasan letest movie
Director shankar latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles