Pimples natural beauty home remedies skin problems heathy food items

pimples natural tips, skin beauty tips, pimples reduce tips, pimples natural home remedies, natural home remedies reduce pimples, beauty tips telugu, pimples beauty tips, healthy home foods, skin health tips, skin problems, pimples care tips, skin care tips, healthy home foods

pimples natural beauty home remedies skin problems heathy food items : We can reduce the pimples and skin problems by natural home remedies which are using in daily home foods

నేచురల్ రెమెడీస్’తో మొటిమల నివారణ

Posted: 12/06/2014 04:39 PM IST
Pimples natural beauty home remedies skin problems heathy food items


సాధారణంగా ప్రతిఒక్కరికి మొటిమలు రావడం సహజం. వాటిని తొలగించుకునేందుకు ఎన్నోరకాల క్రీములు మార్కెట్’లో లభ్యమవుతాయి. అయితే వాటితో కొన్ని చర్మసమస్యలు ఏర్పడే అవకాశాలు వున్నాయి. పైగా ఆ క్రీములతో అంత త్వరగా మొటిమలు నివారింపబడవు. ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అలాకాకుండా నేచురల్’గా వాటిని శాశ్వతంగా తగ్గించుకోవడానికి కొన్ని రెమెడీస్ అందుబాటులో వున్నాయి. వాటిని సమయానుకూలంగా పాటిస్తే... త్వరగా మొటిమలు మాయమవడంతోపాటు కాంతివంతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి అవేమిటో ఒకసారి తెలుసుకుందాం...

1. లవంగాలు : సొంటి, లవంగాలను నీటితో బాగా నూరి లేపనం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు వున్న చోట రెగ్యులర్’గా రాసుకుంటే.. త్వరలోనే అవి తగ్గుతాయి.

2. ముల్తాని మట్టి : ఈ మట్టిలో రోజ్ వాటర్’ను కలిపి ఒక ప్యాక్’లా చేసుకోవాలి. దీనిని ముఖానికి నిత్యం వేసుకుంటే త్వరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

3. జాజికాయ : ఈ కాయను నీటితో అరగదీసి.. ఆ లేపనాన్ని ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తే.. మంచి ఫలితం దక్కుతుంది.

4. ఉల్లిపాయ : ఉల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై బాగా రుద్దుకోవాలి. ఇలా చేసిన కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. బియ్యం : బియ్యం కడిగిన నీటిని ముఖంపై వున్న మొటిమలపై మృదువుగా రుద్దాలి.

6. ఐస్ క్యూబ్ : ఒకవేళ మొటిమ చితికినట్లయితే.. దానిమీద ఐస్’క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దితే మంచిది. అలా చేస్తే.. అందులో ఉన్న రసి అంతా వచ్చేస్తుంది.

7. ఫేస్ వాష్ : బయటినుంచి ఇంట్లోకి వచ్చిన వెంటనే ఫేస్’వాష్ చేసుకోవడం మంచిది. అలా చేస్తే.. ముఖంపై పడిన దుమ్ము చర్మరంధ్రాల్లో చేరకుండా శుభ్రంగా వుంటుంది.

8. వేప ఆకు : ఈ ఆకులను నీళ్ళలో బాగా ఉడికించి, ఆ నీటిని బకెట్ చల్లని నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలతోబాటు చర్మవ్యాధులు కూడా తగ్గుతాయి.

9. పసుపు : కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.

10.  పుదీనా : ఈ ఆకులను ముఖంపై పరచి వుంచి, పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more