Foot care home remedies beauty tips

foot care remedies, foot beauty tips, feet beauty tips, feet home remedies, beauty tips, feet beauty tips, cracked feet, heal cracked feet, home remedies cracked feet, heal cracked feet tips, dry cracked feet, cracked heals, feet health tips

foot care home remedies beauty tips ; the beauty and home remedies for cracked feet

పాదాల పగుళ్ళ నివారణకు చిట్కాలు

Posted: 12/05/2014 03:43 PM IST
Foot care home remedies beauty tips

మారుతున్న వాతావారణ పరిస్థితుల కారణంగా మానవ శరీరానికి అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. అందులో ఇతర సమస్యల గురించి కాస్త పక్కనపెడితే.. సాధారణంగా చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లక్కూడా సంభవిస్తుంది. ఈ సమస్య మొదట్లో అంతగా ప్రభావం చూపదుగానీ.. రానురాను చాలా ప్రాబ్లమ్స్’ను క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఈ పగుళ్ల లక్షణాలు కనబడిన వెంటనే వాటిని నివారించుకుంటే మంచిది.

పాదాల పగుళ్ల సంరక్షణకు చిట్కాలు :

1. వంటనూనె : వంటకాల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముందుగా పాదాలను ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్ది మృత చర్మం, మురికి వదిలించాలి. తర్వాత శుభ్రంగా కడిగి తుడినూనె అప్లై చేయాలి. తర్వాత సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

2. బియ్యం పిండి : బియ్యం పిండిలో కాస్త తేనె, యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టిన అనంతరం ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడినూనె పూసుకుని సాక్స్‌ వేసుకుని పడుకోవాలి.
3. వేపాకు : ఈ ఆకులో పాదాల పగుళ్లనుంచి రక్షణ కల్పించే యాంటీఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా వుంటాయి. గుప్పెడు వేపాకుకు స్పూను పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దిన చేసుకోవాలి.

4. రోజ్‌ వాటర్‌ - గ్లిజరిన్‌ : గ్లిజరిన్‌ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తే.. రోజ్‌ వాటర్‌లోని ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి రోజూ నిద్రపోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.

5. ప్యారాఫిన్‌ వ్యాక్స్‌ : పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవ నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి వేడిచేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేంతవరకూ వేడిచేసి పూర్తిగా చల్లార్చాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cracked heals  cracked skin  beauty tips  foot care remedies  health tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more