వేసవిలో వేడితాపం ఎక్కువగా వుండటం వల్ల అందులో నుంచి వెలువడే రకరకాల కిరణాలు ఆరోగ్య సమస్యలు రావడానికి కారకులవుతాయి. అలాగే మానవ శరీర అందాన్ని కూడా ఇవి హాని కలిగిస్తాయి.
వేసవికాలం రాగానే ప్రతిఒక్కరు తమ అందానికి సంబంధించిన అనేక జాగ్రత్తలను వహిస్తారు. ముఖ్యంగా చర్మం పొడిబారకుండా, ముడతలు రాకుండా రకరకాల లోషన్లు, శరీరానికి తగ్గట్టు వస్త్రాలను ధరించడం, శరీరం నుంచి వెలువడే చెమటను అదుపులో వుంచుకోవడం లాంటి టిప్స్ ని చాలా వరకు ఫాలో అవుతారు.
కొందరు సూర్మరశ్మి నుంచి తమనుతాము కాపాడుకునేందుకు ముఖానికి స్కార్ఫ్ లు కట్టుకోవడం, గొడుగులు తమవెంట తెచ్చుకోవడం లాంటి రక్షణ పద్ధతులను అనుసరిస్తారు.
అయితే ప్రతిఒక్కరు ఇటువంటి పద్ధతులనే అనుసరించరు. తమనుతాము సూర్మరశ్మి నుండి కాపాడుకోవడంలో చాలావరకు విఫలం అవుతారు.
చుట్టూ వున్న వాతావరణ పరిస్థితుల మార్పులవల్ల మన శరీర అందం, జుట్టు పొడిబారిపోతుంది. పైగా వేసవి కాలంలో సూర్యరశ్మిలో వుండే అల్ట్రావాయోలెట్ కిరణాలు జుట్టును నిర్జీవం చేసేస్తాయి. జుట్టు కొనలు చిట్లి, పొడిబారినట్లు కనిపిస్తాయి. కాబట్టి ఏవిధంగా అయితే మనం చర్మం కోసం జాగ్రత్తలు తీసుకుంటామో.. అదేవిధంగా జుట్టు సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.
వేసవిలో జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. తలస్నానం చేయడం.... వేసవికాలంలో ప్రతిఒక్కరికి చెమట ఎక్కువగా విడుదలవుతుంది. పైగా వాతావరణ కాలుష్యాల వల్ల చుట్టుపక్కల వుండే దుమ్ము, ధూళి తలలోకి చేరి... చెమటతో కలిసిపోయి మురికిగా మారి, చుండ్రులా తయారయిపోతుంది. దీంతో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల తలమీద వుండే మురికిని నివారించి, జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. అయితే వేసవి కాలంలో చల్లనీటితో మాత్రమే తలస్నానం చేసుకోవాలి. ప్రతిరోజు ఏదైనా మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేసుకోవడం ఎంతో మేలు.
2. జుట్టుకు మసాజ్.... జుట్టుకు ప్రతిరోజూ ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం వల్ల... తలలో వుండే దుమ్ము, ధూళి తొలగిపోతుంది. పైగా తలలో బ్లడ్ సర్య్కులేషన్ కూడా పెరుగుతుంది. అంతేకాదు.. జుట్టు, రూట్ కెనాల్ కు తగినంత శక్తిని అందించి, కేశాలు దృఢంగా తయారవడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు తలస్నానానికి ముందు జుట్టుకు ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం చాలా మంచిది.
3. ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు తమ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికిగాని, ఆఫీసుకు వెళ్లేవాళ్లుగాని నిత్యం బయటే తిరుగుతూ వుంటారు. అటువంటి సమయాల్లో మీరు మీ జుట్టును బయట తిరిగే సమయాల్లో కాటన్ వస్త్రంతో కప్పి ఉంచడం చాలా మంచిది... లేదా ఏదైనా హ్యాట్ ధరించడం మంచిది. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మిలోని హానికర కిరణాలు కేశాలకు తగలకుండా రక్షణ కల్పించుకోవచ్చు.
4. కూలింగ్ ఆయిల్స్.... అశ్వగంధ, ఆమ్లా, బ్రహ్మి వంటి కూలింగ్ ఆయిల్స్ జుట్టుకు చల్లని ప్రభావాలు కలిగిస్తాయి. ఇవి జుట్టుకు సహజ అందాలను కూడా అందిస్తాయి. సూర్యరశ్మి నుండి జుట్టు పొడిబారకుండా ఇవి కాపాడుతాయి. అయితే వీటిని పగటిపూట వేసుకోవడమే చాలా మంచిది.
5. నీరు తాగడం.... చాలా మంది అమ్మాయిలు తమ జుట్టును సూర్మరశ్మి నుంచి కాపాడుకునేందుకు గట్టిగా, బిగుతుగా వుండే జడలను అల్లుకుంటారు. కానీ ఇలా చేయడం శ్రేయస్కరం కాదు. జుట్టును నిత్యం వదులుగా వుండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా వేసవిలో మన శరీరంలో వుండే నీటిశాతం చెమట రూపంలో బయటకు ఎక్కువగా విడుదలవుతుంది. ఫలితంగా ఇది జుట్టును పొడిబారిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి శరీరంలో నీటిశాతం తగ్గకుండా నిత్యం నీరు తీసుకోవడం కూడా చాలా మంచిది.
6. జుట్టుకు స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం నివారించుకుంటే చాలా మంచిది. ఈ సాధనాలు జుట్టును వేడిచేస్తాయి. ఫలితంగా జుట్టు త్వరగా పొడిగా మారిపోతుంది. కాబట్టి స్టైలింగ్ సాధనాలు ఎక్కువగా ఉపయోగించకుండా వుంటే చాలా మంచిది. జుట్టుకు సంబంధించిన సరైన చర్యలు శ్రద్ధగా పాటిస్తే.. అవి ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా వుంటాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more