తరచూ ముఖం కడుక్కోవడం వల్ల వేసవి తాపం నుండి కొంత వరకు విముక్తి పొందినా , మనం ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ముఖం పై మురికి చేరుతుందని, కేవలం నీళ్ళతో ముఖం కడుక్కోవడం వల్ల మురికి పొదనీ తెలిసిందే ... అలాగని తరచూ రసాయనాలతో తయారు చెయ్యబడ్డ క్లెన్సర్లు వాడినా ప్రమాదమే ... మరి ఈ సమస్యకు పరిష్కారం ??? చర్మానికి ఏ మాత్రం హాని చెయ్యకుండా , మేలు చేసే సహజ ఉత్పత్తులతో ఇంట్లో నే , క్లెన్సర్లని తయారు చేసుకోవడం .
కీర దోస లేదా టమాటా ని గుండ్రని ముక్కగా కోసి , కనీసం ఒక పావు గంట సేపు ఈ ముక్కాలా తో ముఖాన్ని మర్దనా చేసుకోవాలి ... తరువాత చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుంటే , చర్మంపై మురికి పోయి కాంతివంతంగా తయారవ్వడమే కాక , ఎండ వల్ల ఏర్పడ్డ ట్యాన్ కూడా తొలుగుతుంది .
రసం పిండేసిన నిమ్మకాయ ముక్క తో ముఖం , మెడ శుభ్రం చేసుకున్నా చర్మం కాంతిగా తయారయ్యి , ట్యాన్ దూరమవుతుంది ... కేవలం ముఖం , మెడకే కాక, చేతులు , పాదాలకి కూడా ఈ బ్యూటీ టిప్ పనిచేస్తుంది ...
పచ్చి పాలు, పసుపు, కాస్తంత సెనగ పిండి ఈ మూడు తగు మోతాదులో కలిపి ముఖానికి , మెడకి ప్యాక్ లా వేసి , రోజ్ వాటర్ లేదా చల్లని నీళ్ళతో , 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకున్నట్లయితే , బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేసినంత అందంగా ముఖం తయారవ్వడం ఖాయం .
యాపిల్ ని తినడమే కాదు , పలుచని ముక్కలుగా కోసి , ముఖం పై పెట్టుకుని , ఆరినతరువాత శుభ్రం చేసుకున్నా , మంచి ఫలితం కలుగుతుంది ...
ఇకనేం , ఈ టిప్స్ పాటించి , వేసవి తాపం తో వాడి పోకుండా , మీ అందం తో ఈ వేడిని తరిమికొట్టండి .
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more