Tips to reduce and avoid pimples

reducing pimples, avoiding pimples, tips to reduce pimples, tips to avoid pimple marks, tips for pimples

Tips to reduce and avoid pimples.

మెటిమలు తగ్గడానికి చిట్కాలు

Posted: 05/01/2013 06:58 PM IST
Tips to reduce and avoid pimples

 

 

 

ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి. నొప్పిగా ఉండటమే కాకుండా అంద విహీనతకు కారణమౌతుంది. ఏ పార్టీకో, ఫంక్షన్‌ కో వెళ్లాల్సివచ్చినప్పుడు ముక్కుమీదో, బుగ్గమీద మొటిమలు ఉన్నాయనుకోండి మహా వెలితిగా ఉంటుంది. కొంత శ్రమ, కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవడం ఏమంత కష్టం కాదు. మొత్తం శరీరాన్ని అంతా కప్పి ఉంచేది చర్మమే కదా. కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు. వచ్చినా తగ్గిపోతాయి. ఈ కింది జాగ్రత్తలు పాటించినట్లయితే మొటిమలు తగ్గుతాయి.

1. మొటిమ గనుక చితికినట్లయితే దానిమీద ఐస్‌ క్యూబ్‌ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన్న రసి అంతా వచ్చేస్తుంది.

2. బయటకు వెళ్లి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

3. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్‌ నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.

4. కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.

5. పుదీనా ఆకులను ముఖాన పరచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పిచేస్తాయి.

6. సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారుచేసి రాస్తూ వుంటే మొటిమలు తగ్గుతాయి.

7. ముల్తాని మట్టిలో రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్‌ వేసుకోకూడదు.

8. జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి.

9. నీరుల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గుతాయి.

10. బియ్యం కడిగిన నీటిని మొటిమలపైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more