sv rangarao a legend of telugu cinema తెలుగు సినిమా విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు

Sv rangarao a legend of telugu cinema

Samarla Venkata Ranga Rao, sv rangarao, sv rangarao birthday, sv rangarao performence, sv rangarao nuziweedu, sv rangarao action, sv rangarao movies, sv rangarao hits, sv rangarao tollywood, sv rangarao kollywood

S.V. Ranga Rao was born on July 3, 1918 in Nuziweedu, Andhra Pradesh, India as Samarla Venkata Ranga Rao. He was an actor, director and producer

తెలుగు సినిమా విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు

Posted: 07/04/2017 07:38 PM IST
Sv rangarao a legend of telugu cinema

ఆరడుగుల అజానుభావుడు.. నిలువెత్తు మూర్తివభించిన కళాయశస్వి. తన గాంభీర్యంతో చూపురులను హడెలెత్తించగల రూపం. తన అద్బత నటనా ప్రతిభతో ప్రేక్షకుల కళ్లవెంట కన్నీరు కార్చేలా చేసిన నటనామూర్తి.. ఎవరైనా వున్నారా..? అంటే అది ఒక్క ఎస్వీ రంగారావే. నేపాల మాంత్రికునిగా భూపాలం దద్దరిల్ల చేసినా.. కీచకునిగా విరాటదేశాన్ని విలవిలలాడించినా... బంగారుపాప కోసం కన్నీరు మున్నీరయ్యేలా ఏడ్చినా... అన్నదమ్ముల ఐకమత్యంలో వున్న బలాన్ని చాటినా ఆయనకు అయనే సాటి. నటనలో నేటికీ ఎవరూ రారు అయన సాటి

క్రూరంగానూ, కరుణంగానూ.. రౌద్రంగానూ.. శాంతంగానూ, అనుభవాలను వ్యక్తం చేసే పాత్రలలోనూ ఆయన ప్రదర్శించిన నటవిశ్వరూపానికి కొలమానమే లేదు. హాలీవుడ్‌లో లార్డ్ బిరుదు పొందిన లారెన్స్ ఒలివర్ ‘నర్తనశాల’లో ఎస్వీఆర్ నటన చూసి ‘బెటర్ దేన్ మీ’ అన్నారంటే.. ఆయన నటవిశ్వరూపం ముందు ఎవరైనా చిన్నబోవాల్సిందే. తనకన్నా మెరుగైన ప్రధర్శన ఇచ్చారని బాహాటంగా కళాకారులను అభినందించడం కూడా గొప్ప విషయమే. అయినా ఎస్వీ రంగారావు నటనావైభవం ఎదుట ఎవరైనా కిన్నవ్వక తప్పదు.

యస్వీ రంగారావు కనిపించగానే పలు పాత్రలు తమకు తగ్గ దేహం దొరికిందని పరుగులు తీసేవి... లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేయడమే ఎస్వీఆర్‌కు బాగా తెలుసు... దుష్టపాత్రల్లో జడిపించిన రంగారావు, శిష్ట పాత్రల్లోనూ మెప్పించారు. ఇలా ప్రతీ పాత్రలోనూ ఒదిగిపోయి.. ప్రేక్షకులను ఒప్పంచారు.. మురిపించారు... ఏది చేసినా తనదైన మార్కును ఆ పాత్రలో ప్రవేశింప చేయడం ఎస్వీఆర్‌ ప్రత్యేకత... కళ యశస్వీ ధరించిన ఏ పాత్రకైనా ఆయన తగు న్యాయం చేసేవారు.

కృష్ణా జిల్లాలోని నూజివీడులో 1918 జూలై 3 ఆయన జన్మించారు. తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించిన ఎస్వీ రంగారావు స్థానిక హిందూ కాలేజిలో ఇంటర్ సహా డిగ్రీ వరకు చదివాడు. ఆయన అరగుడుల దేహానికి తన డిగ్రీ పూర్తికాగానే అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా ఉద్యోగం వచ్చింది. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు.

ఆయన నటనా చాతుర్యాన్ని చూసిన బివి రామానందం ఆయనకు వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగి నటించే అవకాశం ఇచ్చారు. దీంతో ఎస్వీ రంగారావు తన తొలిచిత్రంలోనే నటనారంగ అనుభవంతో అదు్భుతంగా రాణించి ప్రేక్షకుల మనన్నలను అందుకున్నాడు. ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.

పౌరాణికాల్లో పటిమ చూపి, జానపదాలతో జనాన్ని రంజింపచేసి, చరిత్రపుటల్లోని పలు పాత్రలకు జీవం పోసి, సాంఘికాల్లో సహజత్వాన్ని చూపి ఎస్వీఆర్‌ దక్షిణాది వారిని అలరించారు... తెలుగునాట ఎంతటి ఆదరణ ఉందో, తమిళంలోనూ సమానమైన అభిమానాన్ని సంపాదించిన ఘనుడు ఎస్వీ రంగారావు... అనేక పాత్రలకు జీవం పోసిన రంగారావు నిర్మాతగా 'నాదీ ఆడజన్మ'తో అద్భుతవిజయం చూశారు... దర్శకునిగా 'చదరంగం, బాంధవ్యాలు' తీసి చేతులు కాల్చుకున్నారు... ఏది ఏమైనా మహానటునిగా జనం మదిలో నిలచి, 'విశ్వనటచక్రవర్తి' అనిపించుకున్నారు ఎస్వీఆర్‌...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sv rangarao  movies  birthday  telugu cinema  tollywood legend  kollywood  

Other Articles