doctor c narayana reddy life achivements అపర జ్ఞానానిధికి ప్రతిరూపం డాక్టర్ సి నారాయణరెడ్డి

Doctor c narayana reddy life achivements

Cingireddi Narayana Reddy, cnare, cnare awards, cnare goldern era, cnare songs, cnare literature, cnare poems, dr.c.narayana reddy, jnanpith awardee, poet, telugu literature, cnare

Doyen of Telugu literature and Jnanpith awardee Dr C Narayana Reddy glorious era in Telugu literature and high lights

అపర జ్ఞానానిధికి ప్రతిరూపం డాక్టర్ సి నారాయణరెడ్డి

Posted: 06/15/2017 06:27 PM IST
Doctor c narayana reddy life achivements

అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు.. అన్నారు సాహితీవేత్త డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి.. అసువులు అలుపుకు కానీ అక్షరాలకు కాదన్నది నిజమైతే.. తెలుగువారి గుండె, గొంతులు ధ్వనించు వరకు శ్వాసనిశ్వాసాలు అడువరకు మీరు చిరంజీవులే. బౌతికంగా మా మధ్యలేకపోయినా.. అక్షరాలు వున్నంత వరకు.. మీ కలం నుంచి జాలువారిన కవిత్వాలు, గ్రంధాలు, గేయాలతో ఎప్పటికీ మామధ్యే వుంటారు. తెలుగు బాషకు వన్నెలద్దిన ఎందరో కవివర్యులలో ఆయన కూడా అగ్రగన్యులే. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్ లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు సినారే.  1931, జూలై 29 మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. ఆ రోజుల్లో అందుబాటులో వున్న వీధిబడుల్లోనే అయన ప్రాథమిక విద్యాబ్యాసం సాగింది. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. ఆయన ఇంటర్, డిగ్రీలు ఉర్దూ మాద్యమంలోనే సాగినా.., ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ, డాక్టరేట్ పట్టాలను పోందారు.

డాక్టర్ సి నారాయణ రెడ్డి కూడా అప్పట్లో సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాలను ఎదుర్కోవాలని భావించారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనకు బాల్య వివాహాన్ని చేయడమే ఇందుకు కారణం. అయితే ఆయన భార్య సుశీల అంటే అయనకు అమితమైన ఇష్టం, గౌరవం కూడా. అందుకనే ఆమె మరణించిన తరువాత సుశీల సాహీతీ పురస్కారాలను ఔత్సాహిక మహిళా సాహితీకారులకు అందించేవారాయన. అయనకు నలుగురు కుమార్తెలు. గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి.

ప్రారంభంలో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేసిన నారాయణరెడ్డి.. తర్వాత నిజాం కాలేజీలో, అటుపై ఉస్మానియా వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనిర్సిటీ ఉపకులపతిగానూ ఆయన సేవలందించారు. ఉద్యోగం చేస్తూనే సాహితీసేవను కొనసాగించారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు సినారే మాత్రమే కావడం గమనార్హం.

ఆయన విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. ప్రముఖంగా కవి అయినప్పటికీ పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సినిమా పాటలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు తదితర ప్రక్రియలన్నింటిలో విశేష రచనలు చేశారు. కాలేజీ రోజుల్లో ‘శోభ’ అనే పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించారు.

‘జనశక్తి’ పత్రికలో సినారె కవిత తొలిసారి అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించి సత్తా చాటుకున్నారు. 1953 లో ‘నవ్వని పువ్వు’ సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. ఇది సినారె తొలి ప్రచురణ. ఆ వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది.

ఇక ఆయన 1962లో గులేబకావళి కథ చిత్రంలో నన్ను దోచుకుందువటే వన్నెల దోరసాని అన్న పాట ఇప్పటికీ తెలుగువారి మనస్సులను దోచుకుంటుంది. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన సినీ ప్రాస్థానం 100 వరకు నిరాటంకంగా సాగింది. అయితే అప్పటి నుంచి ఆయన కొంత గ్యాప్ తీసుకన్న తరువాత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 1997లో రూపోందించిన ఓసేయ్ రాములమ్మ చిత్రంలో టైటిల్ సాంగ్ ను రాశారు.

ఆ తరువాత ప్రేమించు, సీతయ్య, చిత్రాలలో తన కలం నుంచి జాలువారిన గేయాలను అందించిన ఆయన 2009లో వచ్చిన అరుంధతి చిత్రానికి టైటిల్ సాంగ్ తో తన సినీ గేయ ప్రస్థానాన్ని ముగించారు. ఇక ఆయన కలం నుంచి జాలువారిన కవితలు, గ్రంధాలకు కొదవ లేదు. ఇన్ని చేసిన ఆయన చివరి రోజుల్లో క్యాన్సర్ వ్యాధి భారిన పడ్డారు. గత కొంత కాలంగా ఆయన హైదరాబాద్ నగరంలోని కేర్ అస్పత్రిలో చికిత్స పోందుతు జూన్ 12న పరమపదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dr.c.narayana reddy  jnanpith awardee  poet  telugu literature  cnare  

Other Articles