Who is Ram Nath Kovind, India's new President దేశ ప్రథమ పౌరుడి స్థానంలో అంబేద్కర్ సిద్దాంతి.. రామ్ నాథ్

Who is ram nath kovind india s new president

Ram Nath Kovind, ramnath kovind biography, ram nath kovind 14h president of India, ramnath kovind biodata, ramnath kovind rss, Ram Nath Kovind controversy, ram nath kovind wins, presidential candidate, nda presidential candidate, amit shah presidential candidate, amit shah, bjp, nda

Ram Nath Kovind is an Indian politician who is the 14th and current President of India. He served as the 35th Governor of Bihar from 2015 to 2017.

దేశ ప్రథమ పౌరుడి స్థానంలో అంబేద్కర్ సిద్దాంతి.. రామ్ నాథ్

Posted: 07/29/2017 08:16 PM IST
Who is ram nath kovind india s new president

దేశ 14వ రాష్ట్రపతిగా కొనసాగుతున్న రామ్ నాథ్ కోవింద్.. న్యాయకోవిదుడు. డాక్లర్ బిఆర్ అంబేద్కర్ బాటలో నడిచి.. దేశ అత్యతున్నత స్థాయి పదవిని అందకున్నారు. అణగారిన వర్గానికి చెందిన ఆయన చిన్నతనం నుంచి అకుంఠిత దీక్షతో విద్యాబ్యాసం చేసి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయవాదిగా తన కెరీర్ లో రాణించారు. ఆ తరువాత బీజేపి పార్టీలో చేరి ఎంపీగా సేవలందించారు. గవర్నర్ గా సేవలందించిన ఆయనను ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రపతిగా ప్రతిపాదించింది. తన ప్రత్యర్థి మీరాకుమార్ పై ఆయన భారీ మోజారీటీతో గెలిచారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ దెహత్‌ జిల్లాలోని డేరాపూర్‌ తహశీల్‌లోని పరాంఖ్‌ గ్రామంలో 1 అక్టోబర్ 1945లో జన్మించారు. రాష్ట్రపతిగా సేవలందించేందుకు ముందు ఆయన బీహార్ 36వ గవర్నర్ గా 2015 నుంచి కొనసాగారు. రామ్ నాథ్ కోవింద్ భారతీయ జనతా పార్టీ కి చెందిన రాజకీయ నాయకులు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగుతూనే.. ఆయన బీజేపి సిద్దాంతాలకు అకర్షితులై ఆ పార్టీ చేరారు. 1991లో బీజేపి పార్టీలో చేరిన ఆయనకు పార్టీ  రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి సముచిత స్థానాన్ని అందించి గౌరవించింది. 1994-2000 మరియు 2000-2006 రెండు పర్యాయాలు ఆయన ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ కు ఎన్నిక అయ్యారు.

అంతకుముందు ఆయన మూడు పర్యాయాలు సివిల్స్ పరీక్షల రాసి వాటిలో ఉత్తీర్ణలయ్యారు. అయితే తాను అశించిన కలెక్టర్ (ఐఎఎఃస్) అతడికి దక్కకపోవడంతో ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా స్థిరపడ్డారు. అయితే న్యాయవాదిగా కూడా పేదలకు తరపున తన వాదనలు వినిపించి వారికి న్యాయం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.  1991 లో బీజేపి పార్టీలో చేరిన ఆయన బిజెపి దళిత మోర్చా యొక్క మాజీ అధ్యక్షుడు (1998-2002). మరియు ఆల్-ఇండియా కోలి సమాజ్ అధ్యక్షుడు. బిజేపి పార్టీ జాతీయ ప్రతినిధిగా పనిచేశారు.

రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఉండటం, మంచి వక్త కావడం, రైతు, దళిత కుటుంబం నుంచి రావడం, పేదల పక్షాన నిలవడం.. హుంగు, ఆర్భాటాలకు దూరంగా నిరాడంబర జీవితం గడుపుతూ.. పేదల పక్షపాతిగా నిలిచి వారి పక్షాన పోరాడటంతో ఆయన వ్యక్తిత్వాని, స్వభావాన్ని కూడా గమనించిన బీజేపి పార్టీ ఆయకు ఉన్నత పదవులను అందించి అతని సేవలను వినియోగించుకుంది. పార్టీకి ఎస్సీ మెర్చా అధ్యక్షుడిగా మూడుసార్లు సేవలు అందించడం, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేయడం, రాజ్యాంగం, అంబేడ్కర్‌ సిద్ధాంతాల పట్ల పూర్తి అవగాహన తదితరాలతో పాటు ఆయన గుణగణాలను పరిగణనలోకి తీసుకొని ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

కోవింద్‌ పూర్తిగా వివాదరహితుడు. రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న విద్యావంతుడు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే లౌకిక వ్యక్తి కావడం కూడా ఆయనకు అత్యున్నత పదవికి తన వద్దకు చేర్చింది.  ఉత్తరప్రదేశ్‌ ప్రజలు 2014 సాధారణ ఎన్నికల్లో, 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపికి అఖండ మెజార్టీ కట్టబెట్టిన వ్యక్తుల్లో కోవింద్ కూడా ఒకరు. ఇందులో దళితులూ ప్రధాన భూమిక పోషించారు. వారు చూపించిన అభిమానానికి ప్రతిఫలంగా అదే వర్గానికి చెందిన వ్యక్తిని దేశ ప్రథమ పౌరుడి స్థానానికి ఎంపిక చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Nath Kovind  14th presidential candidate  BJP leader  Bihar governer  

Other Articles

 • Great saint of modern india sadguru kasireddy nayana who feed the hungry

  క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు.. భగవాన్ శ్రీ కాశీరెడ్డినాయన

  Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more

 • Freedom fighter father of telangana konda laxman bapuji

  తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

  Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more

 • Telanagana recalls professor jayashanker on his death annivesary

  తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

  Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

 • Prominent freedom fighter subash chandrabose biography

  అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

  Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

 • A tribute to ghantasala venkateswara rao on his birthday

  ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

  Dec 22 | తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో... Read more

Today on Telugu Wishesh